ఇంతగా నేర్చితివి నీ విన్నియు నిందుకొరకే
(॥పల్లవి॥)
ఇంతగా నేర్చితివి నీ విన్నియు నిందుకొరకే
మంతనవ్వులే కా మక్కువకు మందులు
(॥ఇంత॥)
మించి ఇంతులు వలవ మిక్కిలి నీవాడేటి-
మంచిమాటలేకావా మచ్చుమేపులు
పంచల నందరికిని పాయరానిపొందులకు
కంచపుఁబొత్తులేకావా గాలపువేఁటలు
(॥ఇంత॥)
కొమ్మలననువులరు కొనగోరితాఁకులు
చిమ్ములేకా విడువనిచేపట్లు
నెమ్మనములు గరఁగ నిలుచుండి నీవు చూచే-
వుమ్మడి చూపులేకావా వుంకుధనములు
(॥ఇంత॥)
కూడిన కూటములకు గుఱుతులు రేఁచేవి నీ-
వేడెపుమోవులే కావా నీడుదోళ్లు
యీడనే శ్రీవేంకటేశ ఇందరి నేలితి విట్టె
వేడుకమొక్కులేకావా వెలలేని యాసలు
(||pallavi||)
iṁtagā nersidivi nī vinniyu niṁdugŏrage
maṁtanavvule kā makkuvagu maṁdulu
(||iṁta||)
miṁchi iṁtulu valava mikkili nīvāḍeḍi-
maṁchimāḍalegāvā machchumebulu
paṁchala naṁdarigini pāyarānibŏṁdulagu
kaṁchabum̐bŏttulegāvā gālabuvem̐ṭalu
(||iṁta||)
kŏmmalananuvularu kŏnagoridām̐kulu
simmulegā viḍuvanisebaṭlu
nĕmmanamulu garam̐ga nilusuṁḍi nīvu sūse-
vummaḍi sūbulegāvā vuṁkudhanamulu
(||iṁta||)
kūḍina kūḍamulagu guṟudulu rem̐sevi nī-
veḍĕbumovule kāvā nīḍudoḽlu
yīḍane śhrīveṁkaḍeśha iṁdari nelidi viṭṭĕ
veḍugamŏkkulegāvā vĕlaleni yāsalu