ఇంతక తొల్లేమియు నే నెఱఁగఁబో
(॥పల్లవి॥)
ఇంతక తొల్లేమియు నే నెఱఁగఁబో
మంతనానఁ దనకే నే మరులైతిఁబో
(॥ఇంత॥)
చెక్కులెల్లాఁ జమరించెఁ జింతలెల్లాఁ జిగిరించె
చొక్కుల నిట్టే తాఁ జూడఁగానేపో
ముక్కున నూరుపు దొట్టె మోమెల్లా వాడువుట్టె
మక్కువ నాతోఁ దా మాటలాడఁగాఁబో
(॥ఇంత॥)
అంగమెల్లాఁ బులకించె నాయమెల్లా గిలిగించె
అంగడిఁ బయ్యదకొంగు అంటఁగానేపో
ముంగురులెల్లాఁ జెదరె మోవియంతయు నదరె
సంగతి సెలవినవ్వు చల్లఁగా నేపో
(॥ఇంత॥)
కన్నులఁ గెంపులుమీరె కాఁగిటఁ బంతము చేరె
కన్నెనైననన్నుఁ దాఁ గలయఁగాఁబో
చన్నులు పై పై నిక్కె జవ్వనము రతికెక్కె
యిన్నిటా శ్రీవేంకటేశుఁ డిటు గూడఁగాఁబో
(||pallavi||)
iṁtaga tŏllemiyu ne nĕṟam̐gam̐bo
maṁtanānam̐ danage ne marulaidim̐bo
(||iṁta||)
sĕkkulĕllām̐ jamariṁchĕm̐ jiṁtalĕllām̐ jigiriṁchĕ
sŏkkula niṭṭe tām̐ jūḍam̐gānebo
mukkuna nūrubu dŏṭṭĕ momĕllā vāḍuvuṭṭĕ
makkuva nādom̐ dā māḍalāḍam̐gām̐bo
(||iṁta||)
aṁgamĕllām̐ bulagiṁchĕ nāyamĕllā giligiṁchĕ
aṁgaḍim̐ bayyadagŏṁgu aṁṭam̐gānebo
muṁgurulĕllām̐ jĕdarĕ moviyaṁtayu nadarĕ
saṁgadi sĕlavinavvu sallam̐gā nebo
(||iṁta||)
kannulam̐ gĕṁpulumīrĕ kām̐giḍam̐ baṁtamu serĕ
kannĕnainanannum̐ dām̐ galayam̐gām̐bo
sannulu pai pai nikkĕ javvanamu radigĕkkĕ
yinniḍā śhrīveṁkaḍeśhum̐ ḍiḍu gūḍam̐gām̐bo