ఇంతటివాఁడవు యిన్నీ నెఱఁగవద్దా
(॥పల్లవి॥)
ఇంతటివాఁడవు యిన్నీ నెఱఁగవద్దా
వింతగా నెదిరిఁ దమ్ము విచారించవద్దా
(॥॥)
కక్కసమేల సేసేవు కప్పురమేల చల్లేవు
మొక్కితే నెఱఁగవద్దా ముందరెత్తు
పక్కన నేలంటేవు బాసలేల సేసేవు
వొక్కమాటాడితే నూరకుండవద్దా
(॥॥)
చన్నులేల పిసికేవు చలమేల నెరుపేవు
సన్ననే తెలియవద్దా జాణతనము
యెన్నిమారులు నవ్వేవు యింతయేల పెనఁగేవు
వున్నట్లానే వుండి వొద్దిక గావద్దా
(॥॥)
మేరలేల మీ రేవు మెచ్చులేల మెచ్చేవు
చేరితే గరఁగవద్దా చిత్తమెల్లాను
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
సారెఁ గొసరితేఁ జనవియ్య వద్దా
(||pallavi||)
iṁtaḍivām̐ḍavu yinnī nĕṟam̐gavaddā
viṁtagā nĕdirim̐ dammu visāriṁchavaddā
(||||)
kakkasamela sesevu kappuramela sallevu
mŏkkide nĕṟam̐gavaddā muṁdarĕttu
pakkana nelaṁṭevu bāsalela sesevu
vŏkkamāḍāḍide nūraguṁḍavaddā
(||||)
sannulela pisigevu salamela nĕrubevu
sannane tĕliyavaddā jāṇadanamu
yĕnnimārulu navvevu yiṁtayela pĕnam̐gevu
vunnaṭlāne vuṁḍi vŏddiga gāvaddā
(||||)
meralela mī revu mĕchchulela mĕchchevu
seride garam̐gavaddā sittamĕllānu
yīrīdi śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭe
sārĕm̐ gŏsaridem̐ janaviyya vaddā