ఇంతటివాఁడవు నీకు యేమ రెవ్వ రున్నారు
(॥పల్లవి॥)
ఇంతటివాఁడవు నీకు యేమ రెవ్వ రున్నారు
చెంత నీవు సేసినవే చేఁతలుగావా
(॥ఇంత॥)
కొమ్మలమనసులోనికోపములు మానిసేవి
పమ్మి నీవుసేసేటిబాసలేకావా
కమ్మి మొకములనిండా కళ లట్టే రేఁచేవి
చిమ్ముల నీకొనగోరి చెనకులేకావా
(॥ఇంత॥)
కడుసంధానము సేసి కపటాలు పాపేవి
అడియాలమైననీయాసలే కావా
బడిబడిఁ బాయకుండా బాఁతిపడఁ జేసేవి
విడువక నీవు సేసే వినయాలే కావా
(॥ఇంత॥)
జమళిసిగ్గు దీరిచి, చవులు వుట్టించేవి
సుముకమయిననీచూపులే కావా
తమితో శ్రీవేంకటేశ తగ నన్ను నేలితివి
నేమకేవి వీరతులనేరువులే కావా
(||pallavi||)
iṁtaḍivām̐ḍavu nīgu yema rĕvva runnāru
sĕṁta nīvu sesinave sem̐talugāvā
(||iṁta||)
kŏmmalamanasulonigobamulu mānisevi
pammi nīvuseseḍibāsalegāvā
kammi mŏgamulaniṁḍā kaḽa laṭṭe rem̐sevi
simmula nīgŏnagori sĕnagulegāvā
(||iṁta||)
kaḍusaṁdhānamu sesi kabaḍālu pābevi
aḍiyālamainanīyāsale kāvā
baḍibaḍim̐ bāyaguṁḍā bām̐tibaḍam̐ jesevi
viḍuvaga nīvu sese vinayāle kāvā
(||iṁta||)
jamaḽisiggu dīrisi, savulu vuṭṭiṁchevi
sumugamayinanīsūbule kāvā
tamido śhrīveṁkaḍeśha taga nannu nelidivi
nemagevi vīradulaneruvule kāvā