Imtadivaamdavayyaa ninnettu geluvamgavachchu

ఇంతటివాఁడవయ్యా నిన్నెట్టు గెలువఁగవచ్చు
Language

(॥పల్లవి॥)
ఇంతటివాఁడవయ్యా నిన్నెట్టు గెలువఁగవచ్చు
కాంతల భ్రమఇంచే కనుకట్టువాఁడవు

(॥ఇంత॥)
ముప్పిరి వాస్తలాఘనములనే ఇంతి చన్నుల
చిప్పగతులాడేటి సిద్ధుఁడవు
తప్పక మదనమంత్రాలనే చెమటనాన
రప్పించనేరిచిన ఇంద్రజాలవువాఁడవు

(॥ఇంత॥)
పలుమణులు సోఁకించి పడఁతిమైఁ బులకలు
వెలయఁగ మొలపించే విద్యవాఁడవు
పలచని కొనగోరిబదనికలు సోఁకించి
కళలు రేఁచి చొక్కించే గబ్బిటౌళికాఁడవు

(॥ఇంత॥)
చిత్తజభూతము బంపి చెలుల నాకరిషించి
తత్తరించి కూడేటి భూతనాథుఁడవు
మత్తిల శ్రీవేంకటేశ మన్నించితి విటు నన్ను
వుత్తమ వినోదాల యోగిపురుషుఁడవు

(||pallavi||)
iṁtaḍivām̐ḍavayyā ninnĕṭṭu gĕluvam̐gavachchu
kāṁtala bhrama̮iṁche kanugaṭṭuvām̐ḍavu

(||iṁta||)
muppiri vāstalāghanamulane iṁti sannula
sippagadulāḍeḍi siddhum̐ḍavu
tappaga madanamaṁtrālane sĕmaḍanāna
rappiṁchanerisina iṁdrajālavuvām̐ḍavu

(||iṁta||)
palumaṇulu som̐kiṁchi paḍam̐timaim̐ bulagalu
vĕlayam̐ga mŏlabiṁche vidyavām̐ḍavu
palasani kŏnagoribadanigalu som̐kiṁchi
kaḽalu rem̐si sŏkkiṁche gabbiḍauḽigām̐ḍavu

(||iṁta||)
sittajabhūdamu baṁpi sĕlula nāgariṣhiṁchi
tattariṁchi kūḍeḍi bhūdanāthum̐ḍavu
mattila śhrīveṁkaḍeśha manniṁchidi viḍu nannu
vuttama vinodāla yogiburuṣhum̐ḍavu