Imtadimeemdi panulu yimka nee sedilonivi

ఇంతటిమీఁది పనులు యింక నీ చేతిలోనివి
Language

(॥పల్లవి॥)
ఇంతటిమీఁది పనులు యింక నీ చేతిలోనివి
పంతమున మోహము నీపై వేసుకొన్నది

(॥॥)
వెలయఁ గ నీకు నన్ని విన్నపములునుఁ జేసి
తల వంచుక వున్నది తరుణి
కలయ నీమేనెల్లా కందువచూపులఁ జూచి
తలఁచుకొంటా నున్నది తనలోనను

(॥॥)
పనివడి తెచ్చి నిమ్మపండు నీచేతికిచ్చి
నినుపుసిగ్గులతోడ నిలుచున్నది
నన్నుపునఁ గొంత చిరునవ్వు నీముందర నవ్వి
తనియక చెమటల దైవారీని

(॥॥)
కడునిచ్చకముగాఁగ గక్కన నీపాదా లొత్తి
వుడివోని బత్తితోడ నోలలాడీని
యెడయక శ్రీ వేంకటేశ నీవు గూడఁ గాను
చిడుముడిఁ జెలులతోఁ జెప్పి మెచ్చీని

(||pallavi||)
iṁtaḍimīm̐di panulu yiṁka nī sedilonivi
paṁtamuna mohamu nībai vesugŏnnadi

(||||)
vĕlayam̐ ga nīgu nanni vinnabamulunum̐ jesi
tala vaṁchuga vunnadi taruṇi
kalaya nīmenĕllā kaṁduvasūbulam̐ jūsi
talam̐sugŏṁṭā nunnadi tanalonanu

(||||)
panivaḍi tĕchchi nimmabaṁḍu nīsedigichchi
ninubusigguladoḍa nilusunnadi
nannubunam̐ gŏṁta sirunavvu nīmuṁdara navvi
taniyaga sĕmaḍala daivārīni

(||||)
kaḍunichchagamugām̐ga gakkana nībādā lŏtti
vuḍivoni battidoḍa nolalāḍīni
yĕḍayaga śhrī veṁkaḍeśha nīvu gūḍam̐ gānu
siḍumuḍim̐ jĕluladom̐ jĕppi mĕchchīni