Imtadidi galigide neederu valabulu

ఇంతటిది గలిగితే నీడేరు వలపులు
Language

(॥పల్లవి॥)
ఇంతటిది గలిగితే నీడేరు వలపులు
వింతతనము గానిదే వెస ఘనురాలు

(॥ఇంత॥)
వొగ్గి రమణుఁడు తన వొడివట్టి తీసినాను
సిగ్గుతోడ నుండినదే చెలియ
కగ్గులేక యాతఁడే కాతరించి చెనకితే
అగ్గమై వోరిచినదే యన్నిటా నేరుపరి

(॥ఇంత॥)
కూరిమితోడుతఁ బతి కొంగువట్టి పెనఁగితే
మేరలు మీరనిదే మెలుఁత
కోరి మర్మములెల్లా కొనగోర నంటితే
ఆరీతి నాడుకోనిదే యన్నిటా నేరుపరి

(॥ఇంత॥)
కప్పి శ్రీవేంకటేశుఁడు కాఁగిలించి కూడితేను
వొప్పుకొని పాయనిదే వువిద
తప్పక వోచెలులాల తమలో సమ్మతులైతే
అప్పుడే గుట్టుసేసిన దన్నిటా నేరుపరి

(||pallavi||)
iṁtaḍidi galigide nīḍeru valabulu
viṁtadanamu gānide vĕsa ghanurālu

(||iṁta||)
vŏggi ramaṇum̐ḍu tana vŏḍivaṭṭi tīsinānu
siggudoḍa nuṁḍinade sĕliya
kaggulega yādam̐ḍe kādariṁchi sĕnagide
aggamai vorisinade yanniḍā nerubari

(||iṁta||)
kūrimidoḍudam̐ badi kŏṁguvaṭṭi pĕnam̐gide
meralu mīranide mĕlum̐ta
kori marmamulĕllā kŏnagora naṁṭide
ārīdi nāḍugonide yanniḍā nerubari

(||iṁta||)
kappi śhrīveṁkaḍeśhum̐ḍu kām̐giliṁchi kūḍidenu
vŏppugŏni pāyanide vuvida
tappaga vosĕlulāla tamalo sammadulaide
appuḍe guṭṭusesina danniḍā nerubari