ఇంతటిదానవు నీవు యెంతని పొగడవచ్చునే
(॥పల్లవి॥)
ఇంతటిదానవు నీవు యెంతని పొగడవచ్చునే
పొంతఁ గోర కెట్టుందునే పొలఁతి నీ విభుఁడు
(॥ఇంత॥)
సెలవుల నవ్వు దేరీ చెక్కుల మదము గారీ
నెలఁత నీమాఁటలఁ దేనియ లూరీని
కలికి వన్నిటా నీవు గక్కన నిన్నుఁ జూచితే
వలవ కెట్టుండునే వనిత నీ విభుఁడు
(॥ఇంత॥)
మోమున వెన్నెల గాసీ మూపునఁ దురుము రాసీ
ఆమని చన్నులురమునందునఁ బైసేసీ
నీ మంచి చక్కఁదనాలు నెమ్మది నెంచి చూచితే
కామించ కెట్టుండునే కాంత నీ విభుఁడు
(॥ఇంత॥)
మోవిపైనే చిగురెక్కీ మొనగోళ్ళఁ జేఁగలెక్కీ
భావించితే హంసగతి పాదాలఁజిక్కీ
యీవేళ శ్రీవేంకటేశుఁ డింతలోనే నిన్నుఁగూడె
సేవగొన కెట్టుండునే చెలియీ నీ విభుఁడు
(||pallavi||)
iṁtaḍidānavu nīvu yĕṁtani pŏgaḍavachchune
pŏṁtam̐ gora kĕṭṭuṁdune pŏlam̐ti nī vibhum̐ḍu
(||iṁta||)
sĕlavula navvu derī sĕkkula madamu gārī
nĕlam̐ta nīmām̐ṭalam̐ deniya lūrīni
kaligi vanniḍā nīvu gakkana ninnum̐ jūside
valava kĕṭṭuṁḍune vanida nī vibhum̐ḍu
(||iṁta||)
momuna vĕnnĕla gāsī mūbunam̐ durumu rāsī
āmani sannuluramunaṁdunam̐ baisesī
nī maṁchi sakkam̐danālu nĕmmadi nĕṁchi sūside
kāmiṁcha kĕṭṭuṁḍune kāṁta nī vibhum̐ḍu
(||iṁta||)
movibaine sigurĕkkī mŏnagoḽḽam̐ jem̐galĕkkī
bhāviṁchide haṁsagadi pādālam̐jikkī
yīveḽa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone ninnum̐gūḍĕ
sevagŏna kĕṭṭuṁḍune sĕliyī nī vibhum̐ḍu