ఇంతటిదానవౌత యిప్పుడే యెరిఁగితిమి
(॥పల్లవి॥)
ఇంతటిదానవౌత యిప్పుడే యెరిఁగితిమి
వింత నీ నేరుపు లెందు వేరే నేర్చుకొంటివే
(॥ఇంత॥)
చాయలుగా మాఁటలాడి సన్నల నోరూరించి
పాయపు మగని నెంత పనిగొంటివే
కాయజకేలిని మతి గరఁగించి యతనిచే
సేయరాని బాస లెల్లాఁ జేయించుకొంటివే
(॥ఇంత॥)
కంచపుమోవి చూపి కన్నులనే తేలించి
మించి చెలువుని నెంత మెప్పించితివే
వంచనతో మొక్కు మొక్కి వలపులు వెడరేఁచి
మంచితనాననే యెంత మన్నింపించుకొంటివే
(॥ఇంత॥)
వేవేలు చేఁతలు సేసి వేడుకలు వుట్టించి
శ్రీవేంకటేశ్వరు నెట్లు చేకొంటివే
యీవేళ నన్ను నేలె యీతఁడే యింటికి వచ్చి
వావు లాతనికిఁ జెప్పి వలపించుకొంటివే
(||pallavi||)
iṁtaḍidānavauda yippuḍe yĕrim̐gidimi
viṁta nī nerubu lĕṁdu vere nersugŏṁṭive
(||iṁta||)
sāyalugā mām̐ṭalāḍi sannala norūriṁchi
pāyabu magani nĕṁta panigŏṁṭive
kāyajagelini madi garam̐giṁchi yadanise
seyarāni bāsa lĕllām̐ jeyiṁchugŏṁṭive
(||iṁta||)
kaṁchabumovi sūbi kannulane teliṁchi
miṁchi sĕluvuni nĕṁta mĕppiṁchidive
vaṁchanado mŏkku mŏkki valabulu vĕḍarem̐si
maṁchidanānane yĕṁta manniṁpiṁchugŏṁṭive
(||iṁta||)
vevelu sem̐talu sesi veḍugalu vuṭṭiṁchi
śhrīveṁkaḍeśhvaru nĕṭlu segŏṁṭive
yīveḽa nannu nelĕ yīdam̐ḍe yiṁṭigi vachchi
vāvu lādanigim̐ jĕppi valabiṁchugŏṁṭive