Imtadidaanavauda yeṟamgamammaa

ఇంతటిదానవౌత యెఱఁగమమ్మా
Language

(॥పల్లవి॥)
ఇంతటిదానవౌత యెఱఁగమమ్మా
పంతాన నీకంటే నేను బల్లిదురాలనమ్మా

(॥ఇంత॥)
కన్నులార్చ నేరుతూనే కత చెప్ప నేరుతువే
సన్నలు సేసేటి వేసాలు నేర్తువే
యిన్నిచేఁతులు సేసేకా యీతని దక్కఁగొంటివి
మిన్నక వూరకుండితే మెచ్చేరా సతులు

(॥ఇంత॥)
ననుపు సేయ నేర్తువే నవ్వులు నవ్వ నేర్తువే
పెనఁగులాడి బత్తి పెంచ నేర్తువే
చెనకి చెనకి యింత సేసితివి మగవాని
జునిగితే మెరసునా సుదతులపగటు

(॥ఇంత॥)
చెలిమి సేయ నేర్తువే చేరి కూడ నేరుతువే
వలపించి రతులకు వంచ నేర్తువే
అలమె శ్రీవేంకటేశుఁ డలమేల్మంగను నేను
కలపుకోలిట్లానే కావద్దా యింతులకు

(||pallavi||)
iṁtaḍidānavauda yĕṟam̐gamammā
paṁtāna nīgaṁṭe nenu ballidurālanammā

(||iṁta||)
kannulārsa nerudūne kada sĕppa neruduve
sannalu seseḍi vesālu nerduve
yinnisem̐tulu sesegā yīdani dakkam̐gŏṁṭivi
minnaga vūraguṁḍide mĕchcherā sadulu

(||iṁta||)
nanubu seya nerduve navvulu navva nerduve
pĕnam̐gulāḍi batti pĕṁcha nerduve
sĕnagi sĕnagi yiṁta sesidivi magavāni
junigide mĕrasunā sudadulabagaḍu

(||iṁta||)
sĕlimi seya nerduve seri kūḍa neruduve
valabiṁchi radulagu vaṁcha nerduve
alamĕ śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
kalabugoliṭlāne kāvaddā yiṁtulagu