Imtadi nee sakka dana vilaagu nerubulu

ఇంతటి నీ చక్క దన విూలాగు నేరుపులు
Language

(॥పల్లవి॥)
ఇంతటి నీ చక్క దన విూలాగు నేరుపులు
చెంతల నేమని యింకఁ జెప్పుదుమే చెలియా

(॥ఇంతటి॥)
ముత్తెపుఁబలువరుస మొగిఁ దెల్లఁ గాఁ దోమి
జొత్తుల వీడెలు సేసి సొమ్ములతోడ
హత్తి చిఱునవ్వు నవ్వి అప్పుడే విభునివేలి
కొత్తవుంగరము దీసుకొంటి వౌనె చెలియా

(॥ఇంతటి॥)
తిద్దిన నొసలిగీరుఁదిరుమణి గానరాగా
కొద్దిఁ జిగుళ్ళు వెళ్ళినకొప్పుతోడ
అద్ద పునెమ్మోము చూపి అతనిమై గరఁగించి
ముద్దుమో మిచ్చి మోహము ముంచితిమో చెలి

(॥ఇంతటి॥)
వలుదచన్నులమీఁది వలిపెము చెమటలఁ
బలుచఁగా నంటినభావముతోడి
చలివాయఁ గౌఁగిలించి సమరతులనే నీవు
కులికి శ్రీవేంకటేశుఁ గూడితివె చెలి

(||pallavi||)
iṁtaḍi nī sakka dana viూlāgu nerubulu
sĕṁtala nemani yiṁkam̐ jĕppudume sĕliyā

(||iṁtaḍi||)
muttĕbum̐baluvarusa mŏgim̐ dĕllam̐ gām̐ domi
jŏttula vīḍĕlu sesi sŏmmuladoḍa
hatti siṟunavvu navvi appuḍe vibhuniveli
kŏttavuṁgaramu dīsugŏṁṭi vaunĕ sĕliyā

(||iṁtaḍi||)
tiddina nŏsaligīrum̐dirumaṇi gānarāgā
kŏddim̐ jiguḽḽu vĕḽḽinagŏppudoḍa
adda punĕmmomu sūbi adanimai garam̐giṁchi
muddumo michchi mohamu muṁchidimo sĕli

(||iṁtaḍi||)
valudasannulamīm̐di valibĕmu sĕmaḍalam̐
balusam̐gā naṁṭinabhāvamudoḍi
salivāyam̐ gaum̐giliṁchi samaradulane nīvu
kuligi śhrīveṁkaḍeśhum̐ gūḍidivĕ sĕli