ఇంతటి మీఁదటి పను లెఱఁగమయ్యా
(॥పల్లవి॥)
ఇంతటి మీఁదటి పను లెఱఁగమయ్యా
సంతకూటములే కడుఁ జవులాయనయ్యా
(॥ఇంత॥)
వొడఁబాటుమాటలు వుప్పనౌనో చప్పనౌనో
వెడఁగునీమాటలు వినేమయ్యా
తడఁబడి నీసుద్దులు దైలువారీఁ జెవులను
అడఁచరాని నవ్వులు అగ్గువాయనయ్యా
(॥ఇంత॥)
సంగడి మాచెనకులు చల్లనవునో వేఁడౌనో
వుంగిటినీచెనకులు కోరిచేమయ్యా
చెంగటినీనేరుపులు చిత్తములోఁ బేరుకొనె
కుంగనినివ్వెరగులు కోటికొండలయ్యా
(॥ఇంత॥)
మచ్చికమావూడిగాలు మఱపౌనో తలఁపౌనో
కుచ్చి నీమన్నన లియ్యకొనెమయ్యా
తచ్చి శ్రీవేంకటేశ్వర తగ నన్నుయఁ గూడితివి
లచ్చన నీగుఱుతులు లాగవేగాలయ్యా
(||pallavi||)
iṁtaḍi mīm̐daḍi panu lĕṟam̐gamayyā
saṁtagūḍamule kaḍum̐ javulāyanayyā
(||iṁta||)
vŏḍam̐bāḍumāḍalu vuppanauno sappanauno
vĕḍam̐gunīmāḍalu vinemayyā
taḍam̐baḍi nīsuddulu dailuvārīm̐ jĕvulanu
aḍam̐sarāni navvulu agguvāyanayyā
(||iṁta||)
saṁgaḍi māsĕnagulu sallanavuno vem̐ḍauno
vuṁgiḍinīsĕnagulu korisemayyā
sĕṁgaḍinīnerubulu sittamulom̐ berugŏnĕ
kuṁganinivvĕragulu koḍigŏṁḍalayyā
(||iṁta||)
machchigamāvūḍigālu maṟabauno talam̐pauno
kuchchi nīmannana liyyagŏnĕmayyā
tachchi śhrīveṁkaḍeśhvara taga nannuyam̐ gūḍidivi
lachchana nīguṟudulu lāgavegālayyā