Imtadi kaligi gade yee lema

ఇంతటి కలికి గదే యీ లేమ
Language

(॥పల్లవి॥)
ఇంతటి కలికి గదే యీ లేమ
పంత మాడీఁ బైపైనే పతితోను

(॥ఇంత॥)
చెక్కుమీఁదఁ జెయి వెట్టి సెలవుల నవ్వు నవ్వి
యెక్కడో సిగ్గులు వెంచీ నీలేమ
ముక్కుమీఁద వేలు మోఁపి ముంగురులు గోరదువ్వి
మిక్కుటమై లెక్కవెట్టీ మించినజవ్వనము

(॥ఇంత॥)
కన్ను లిట్టె యరవమోడ్చి కందువనే కూచుండి
యేన్నో సేతలు సేసి నీలెమ
సన్నపు టెలుగు లెత్తి సరసపు మాటలాడి
పన్ని దొంతరలు వెట్టీ భావపు మోహనము

(॥ఇంత॥)
కొన కుచములు చూపి కొంకుచు బయ్యె గప్పి
యెనలేక మెరసీని యీలేమ
ఘనుడు శ్రీ వేంకటేశు గలసి యింతటిలొనె
పెనచీఁ దనమేన పెక్కువ సింగారము

(||pallavi||)
iṁtaḍi kaligi gade yī lema
paṁta māḍīm̐ baibaine padidonu

(||iṁta||)
sĕkkumīm̐dam̐ jĕyi vĕṭṭi sĕlavula navvu navvi
yĕkkaḍo siggulu vĕṁchī nīlema
mukkumīm̐da velu mom̐pi muṁgurulu goraduvvi
mikkuḍamai lĕkkavĕṭṭī miṁchinajavvanamu

(||iṁta||)
kannu liṭṭĕ yaravamoḍchi kaṁduvane kūsuṁḍi
yenno sedalu sesi nīlĕma
sannabu ṭĕlugu lĕtti sarasabu māḍalāḍi
panni dŏṁtaralu vĕṭṭī bhāvabu mohanamu

(||iṁta||)
kŏna kusamulu sūbi kŏṁkusu bayyĕ gappi
yĕnalega mĕrasīni yīlema
ghanuḍu śhrī veṁkaḍeśhu galasi yiṁtaḍilŏnĕ
pĕnasīm̐ danamena pĕkkuva siṁgāramu