Imtadi harigim gaagam yela neevu pampu sedu

ఇంతటి హరికిఁ గాకఁ యేల నీవు పంపు సేతు
Language

(॥పల్లవి॥)
ఇంతటి హరికిఁ గాకఁ యేల నీవు పంపు సేతు
వెంత కెంత నీకు నాకె కిద్దరికే తగురా

(॥ఇంతటి॥)
కొమ్మ నిలువుఁదురుముకురులు వేళ్ళ ముడిచి
సొమ్ములలో నిలుచుండి సొలసి నిన్ను
కమ్మి నిడుదమాటల కడకంటిచూపులతో
పమ్మి సణఁగులు చల్లి పచ్చిసేసీ నౌరా

(॥ఇంతటి॥)
యింతి నిమ్మపండ్లు చేత నెగరవేసుకొంటా
దొంతరమాటల నేమో దూరీ నిన్ను
రంతుగా నవ్వులు నవ్వి రాజసాన వీఁగుకొంటా
మంతనాన గొణఁగుతా మచ్చుచల్లీ నవురా

(॥ఇంతటి॥)
పొలఁతి కళలు దేరి పుక్కిటివీడెముతోడ
చెలిచే నా కందుకొంటా చెనకీ నిన్ను
నిలువుఁగస్తూరిబొట్టు నిడుచెమటఁ గరఁగ
కులికి శ్రీవేంకటేశ కూడె నిదె యవురా

(||pallavi||)
iṁtaḍi harigim̐ gāgam̐ yela nīvu paṁpu sedu
vĕṁta kĕṁta nīgu nāgĕ kiddarige tagurā

(||iṁtaḍi||)
kŏmma niluvum̐durumugurulu veḽḽa muḍisi
sŏmmulalo nilusuṁḍi sŏlasi ninnu
kammi niḍudamāḍala kaḍagaṁṭisūbulado
pammi saṇam̐gulu salli pachchisesī naurā

(||iṁtaḍi||)
yiṁti nimmabaṁḍlu seda nĕgaravesugŏṁṭā
dŏṁtaramāḍala nemo dūrī ninnu
raṁtugā navvulu navvi rājasāna vīm̐gugŏṁṭā
maṁtanāna gŏṇam̐gudā machchusallī navurā

(||iṁtaḍi||)
pŏlam̐ti kaḽalu deri pukkiḍivīḍĕmudoḍa
sĕlise nā kaṁdugŏṁṭā sĕnagī ninnu
niluvum̐gastūribŏṭṭu niḍusĕmaḍam̐ garam̐ga
kuligi śhrīveṁkaḍeśha kūḍĕ nidĕ yavurā