(॥పల్లవి॥)
ఇంతటి గడుసులకు నేది వాటి-
చింతలేక నీ మొగానఁ జెలఁగా కళలు
(॥ఇంత॥)
మేలు మేలు జాణవౌదు మెత్తనిమనసు గాదు
యీలీల విరహమాఁప ఇంతకోపను
తాలిమితో గడెవెట్టి తరుణి లోనవుండఁగ
గోలవై మాతో మాటాడఁగొలిపెఁగా నీకును
(॥ఇంత॥)
ఘనుఁడవౌదువు నీవు కరఁగేవాఁడవు గావు
యెనసినచో దంటల మింతేసి కాము
వనిత పంతములకు వాకిట వచ్చివుండఁగ
చెనకి మాతో నవ్వఁ జెల్లెఁగా నీకును
(॥ఇంత॥)
వేడుకకాఁడ వౌదువు వెనకతియ్య వెందుకు
యీడుజోడై కలసే దింతెఱఁగము
ఆడ నాపె వుండఁగాను అట్టె నన్నుఁ గూడితివి
తోడనే శ్రీవేంకటేశ దొరకెఁగా నీకును
(||pallavi||)
iṁtaḍi gaḍusulagu nedi vāḍi-
siṁtalega nī mŏgānam̐ jĕlam̐gā kaḽalu
(||iṁta||)
melu melu jāṇavaudu mĕttanimanasu gādu
yīlīla virahamām̐pa iṁtagobanu
tālimido gaḍĕvĕṭṭi taruṇi lonavuṁḍam̐ga
golavai mādo māḍāḍam̐gŏlibĕm̐gā nīgunu
(||iṁta||)
ghanum̐ḍavauduvu nīvu karam̐gevām̐ḍavu gāvu
yĕnasinaso daṁṭala miṁtesi kāmu
vanida paṁtamulagu vāgiḍa vachchivuṁḍam̐ga
sĕnagi mādo navvam̐ jĕllĕm̐gā nīgunu
(||iṁta||)
veḍugagām̐ḍa vauduvu vĕnagadiyya vĕṁdugu
yīḍujoḍai kalase diṁtĕṟam̐gamu
āḍa nābĕ vuṁḍam̐gānu aṭṭĕ nannum̐ gūḍidivi
toḍane śhrīveṁkaḍeśha dŏragĕm̐gā nīgunu