Imtadevum dimka vemdee yemchi soobumdaa

ఇంతదేవుఁ డింక వేఁడీ యెంచి చూపుఁడా
Language

(॥పల్లవి॥)
ఇంతదేవుఁ డింక వేఁడీ యెంచి చూపుఁడా
చెంతనుండితే రక్షించు చేకొని కొలువరో

(॥ఇంత॥)
వేసితే వేయురూపులు విశ్వరూప మితఁడు
శ్రీసతీశుఁ డిందరిలో శ్రీమంతుఁడు
భాసురపు భూమి మోచే బలవంతుఁ డిన్నిటాను
దాసులైతే మన్నించు నీదైవముఁ గొలువరో

(॥ఇంత॥)
గుట్టున బ్రహ్మాండాలు కుక్షిలో నించినవాఁడు
అట్టె దేవతల మొర లాలించేవాఁడు
చిట్టకపు దానవుల చించి చెండాడేటివాఁడు
ఇట్టే శరణంటేఁ గాచు నీతనిఁ గొలువరో

(॥ఇంత॥)
కాలముఁ గర్మము మాయ గల్పించినయట్టివాఁడు
ఆలించి సర్వజీవుల‌ అంతర్యామి
వాలి శ్రీవేంకటపతై వరములిచ్చేటివాఁడు
యేలీలఁ గొల్చిన మెచ్చు నీవిభుఁగొలువరో

(||pallavi||)
iṁtadevum̐ ḍiṁka vem̐ḍī yĕṁchi sūbum̐ḍā
sĕṁtanuṁḍide rakṣhiṁchu segŏni kŏluvaro

(||iṁta||)
veside veyurūbulu viśhvarūba midam̐ḍu
śhrīsadīśhum̐ ḍiṁdarilo śhrīmaṁtum̐ḍu
bhāsurabu bhūmi mose balavaṁtum̐ ḍinniḍānu
dāsulaide manniṁchu nīdaivamum̐ gŏluvaro

(||iṁta||)
guṭṭuna brahmāṁḍālu kukṣhilo niṁchinavām̐ḍu
aṭṭĕ devadala mŏra lāliṁchevām̐ḍu
siṭṭagabu dānavula siṁchi sĕṁḍāḍeḍivām̐ḍu
iṭṭe śharaṇaṁṭem̐ gāsu nīdanim̐ gŏluvaro

(||iṁta||)
kālamum̐ garmamu māya galbiṁchinayaṭṭivām̐ḍu
āliṁchi sarvajīvula‌ aṁtaryāmi
vāli śhrīveṁkaḍabadai varamulichcheḍivām̐ḍu
yelīlam̐ gŏlsina mĕchchu nīvibhum̐gŏluvaro