Imtadanum garunimchu ide vinnabamu neegu

ఇంతటనుఁ గరుణించు ఇదె విన్నపము నీకు
Language

(॥పల్లవి॥)
ఇంతటనుఁ గరుణించు ఇదె విన్నపము నీకు
ఇంతి యలమేలుమంగ ఇరవై నీకున్నది

(॥ఇంత॥)
చేతుల నీరూపు వ్రాసి చెలరేఁగివుండే యాస
గాతల నీసతి పొద్దుగడపీ నదె
నీతితోడ వీనులను నీకతలు వినేయాస
రాతిరిఁబగలును బీరము సేసుకున్నది

(॥ఇంత॥)
తలపోఁతలను నిన్ను దగ్గరివుండేటియాస
పెలుచై నదేహము పెంచీ నదె
కలలోననైన నిన్నుఁ గాఁగిలించుకొనేయాస
బలువుగాఁ బ్రాణము పట్టుకున్నదదివో

(॥ఇంత॥)
యిట్టె నీవు వచ్చేవని యెదురుచూచేయాస
నెట్టుకొని వేడుకతో నిలుచున్నది
గట్టిగా శ్రీవేంకటేశ కై కొని కూడితి విదె
వొట్టుక నిన్నుఁ బాయక వొద్దికై తానున్నది

(||pallavi||)
iṁtaḍanum̐ garuṇiṁchu idĕ vinnabamu nīgu
iṁti yalamelumaṁga iravai nīgunnadi

(||iṁta||)
sedula nīrūbu vrāsi sĕlarem̐givuṁḍe yāsa
gādala nīsadi pŏddugaḍabī nadĕ
nīdidoḍa vīnulanu nīgadalu vineyāsa
rādirim̐bagalunu bīramu sesugunnadi

(||iṁta||)
talabom̐talanu ninnu daggarivuṁḍeḍiyāsa
pĕlusai nadehamu pĕṁchī nadĕ
kalalonanaina ninnum̐ gām̐giliṁchugŏneyāsa
baluvugām̐ brāṇamu paṭṭugunnadadivo

(||iṁta||)
yiṭṭĕ nīvu vachchevani yĕdurusūseyāsa
nĕṭṭugŏni veḍugado nilusunnadi
gaṭṭigā śhrīveṁkaḍeśha kai kŏni kūḍidi vidĕ
vŏṭṭuga ninnum̐ bāyaga vŏddigai tānunnadi