ఇంతటనైన మన్నించు యీమాటాడితి నేఁడు
(॥పల్లవి॥)
ఇంతటనైన మన్నించు యీమాటాడితి నేఁడు
ఇంతులకు నీకు నేను ఇచ్చలాడేదానను
(॥ఇంత॥)
నీపై మోహపుదాన నీనెలఁత లిందరును
దాపుగా నీవలెనే దయఁజూతురు
రాఁపులోనిదానఁ గాను రమణులకును నీకు
చేపట్టి యేకతవేళ సేవ చేసేదానను
(॥ఇంత॥)
చేసన్న దానను నీకు చెందిన నీసతులను
ఆసలెల్లా నెరవేర్చి ఆదరింతురు
వేసరించేదానఁ గాను వెలఁదులకును నీకు
సేసలు వెట్టించి నట్టి చేతిలోని దానను
(॥ఇంత॥)
అలమేలుమంగ నేను అక్కున నుందాన మీవా
రెలమి నాపంపు నేసి ఇయ్యకొందురు
కలసితి విట్టె శ్రీవేంకటేశ నే వింతఁ గాను
పొలఁతులను నిన్ను నేఁ బొగడేటిదానను
(||pallavi||)
iṁtaḍanaina manniṁchu yīmāḍāḍidi nem̐ḍu
iṁtulagu nīgu nenu ichchalāḍedānanu
(||iṁta||)
nībai mohabudāna nīnĕlam̐ta liṁdarunu
dābugā nīvalĕne dayam̐jūduru
rām̐pulonidānam̐ gānu ramaṇulagunu nīgu
sebaṭṭi yegadaveḽa seva sesedānanu
(||iṁta||)
sesanna dānanu nīgu sĕṁdina nīsadulanu
āsalĕllā nĕraversi ādariṁturu
vesariṁchedānam̐ gānu vĕlam̐dulagunu nīgu
sesalu vĕṭṭiṁchi naṭṭi sediloni dānanu
(||iṁta||)
alamelumaṁga nenu akkuna nuṁdāna mīvā
rĕlami nābaṁpu nesi iyyagŏṁduru
kalasidi viṭṭĕ śhrīveṁkaḍeśha ne viṁtam̐ gānu
pŏlam̐tulanu ninnu nem̐ bŏgaḍeḍidānanu