Imtadamgaani yeṟamga vemisedu nee buddi

ఇంతటఁగాని యెఱఁగ వేమిసేతు నీ బుద్ది
Language

(॥పల్లవి॥)
ఇంతటఁగాని యెఱఁగ వేమిసేతు నీ బుద్ది
పంతపు నీ గుట్టు నేఁడు బయటఁ బెట్టితిని

(॥ఇంత॥)
వలపు పేరఁబెట్టి వాసి తచ్చి చల్లసేసి
కొలుచుకు నీకు నమ్మీ గొల్లెత
పిలిచినా నెఱఁగవు పేరుకొని నే నిన్ను
కులికి యెచ్చరికగా గోర నిన్నూఁదితిని

(॥ఇంత॥)
కాఁకల నెయ్యి గాఁచి గసివెట్టీ సారె సారె
కూఁకటపాయపునీకు గొల్లెత
మాఁకువలె నున్నాఁడవు మన సాపె మీఁదఁ బెట్టి
సోఁకించితిఁ బల్లు నీ సోఁకు మోవి నిందుకు

(॥ఇంత॥)
నిండురతిఁ దరివట్టి నీకె వేల్పులకు మొక్కీ
కొండలవంటి కుచాల గొల్లెత
అండనె శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
గండి బొమ్మ జంకెనల ఘాతలు సేసితిని

(||pallavi||)
iṁtaḍam̐gāni yĕṟam̐ga vemisedu nī buddi
paṁtabu nī guṭṭu nem̐ḍu bayaḍam̐ bĕṭṭidini

(||iṁta||)
valabu peram̐bĕṭṭi vāsi tachchi sallasesi
kŏlusugu nīgu nammī gŏllĕda
pilisinā nĕṟam̐gavu perugŏni ne ninnu
kuligi yĕchcharigagā gora ninnūm̐didini

(||iṁta||)
kām̐kala nĕyyi gām̐si gasivĕṭṭī sārĕ sārĕ
kūm̐kaḍabāyabunīgu gŏllĕda
mām̐kuvalĕ nunnām̐ḍavu mana sābĕ mīm̐dam̐ bĕṭṭi
som̐kiṁchidim̐ ballu nī som̐ku movi niṁdugu

(||iṁta||)
niṁḍuradim̐ darivaṭṭi nīgĕ velbulagu mŏkkī
kŏṁḍalavaṁṭi kusāla gŏllĕda
aṁḍanĕ śhrī veṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
gaṁḍi bŏmma jaṁkĕnala ghādalu sesidini