ఇంతటఁగాని నీయెమ్మె లెరఁగరా యిందరు
(॥పల్లవి॥)
ఇంతటఁగాని నీయెమ్మె లెరఁగరా యిందరు
చెంతనుండి యెన్నేసి చేఁతలు సేసేవే
(॥ఇంత॥)
మొగమెత్తి మాఁటలాడి ముచ్చటలు చెప్పి చెప్పి
నగుతానే వలపులు నాఁట వేసేవే
పగటునఁజనుల్నపై పయ్యద జారఁదోసి
మగని నీ వెంతేసిమాయలఁ బెట్టేవే
(॥ఇంత॥)
పక్కిటివిడెముతోడ పువ్వులు ముడుచుకొంటా
మొక్కుతానే వేపా లెంతమూఁట గట్టేవే
చెక్కులపై జవ్వాది చేతఁదుడుచుకొంటాను
యిక్కడ నీపతి నెంత యలయించేవే
(॥ఇంత॥)
కప్పరముమోని నిచ్చి కాఁగిటఁ జన్ను లూఁది
కొప్పు దువ్వుతానే చెక్కు కొనగోర నంటేవే
అప్పుఁడు శ్రీవేంకటేశుఁడల మేల్మంగవు నీవు
యిప్పుడు నన్నేలె విభుని నెంత గొసరేవే
(||pallavi||)
iṁtaḍam̐gāni nīyĕmmĕ lĕram̐garā yiṁdaru
sĕṁtanuṁḍi yĕnnesi sem̐talu seseve
(||iṁta||)
mŏgamĕtti mām̐ṭalāḍi muchchaḍalu sĕppi sĕppi
nagudāne valabulu nām̐ṭa veseve
pagaḍunam̐janulnabai payyada jāram̐dosi
magani nī vĕṁtesimāyalam̐ bĕṭṭeve
(||iṁta||)
pakkiḍiviḍĕmudoḍa puvvulu muḍusugŏṁṭā
mŏkkudāne vebā lĕṁtamūm̐ṭa gaṭṭeve
sĕkkulabai javvādi sedam̐duḍusugŏṁṭānu
yikkaḍa nībadi nĕṁta yalayiṁcheve
(||iṁta||)
kapparamumoni nichchi kām̐giḍam̐ jannu lūm̐di
kŏppu duvvudāne sĕkku kŏnagora naṁṭeve
appum̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍala melmaṁgavu nīvu
yippuḍu nannelĕ vibhuni nĕṁta gŏsareve