ఇంతటఁ గరఁగవద్దా యిచ్చగించి నీ మనసు
(॥పల్లవి॥)
ఇంతటఁ గరఁగవద్దా యిచ్చగించి నీ మనసు
చెంతలఁ జూచినవారి చిత్తాలు గరఁగెను
(॥ఇంత॥)
చెప్పరాని ప్రియములు చెప్పి నీకు జవరాలు
వుప్పతిల్లుఁ దమితోడ నూరకుండెను
కప్పురపు బొమ్మ నీకుఁ గానుకగాఁ జేతికిచ్చి
దప్పిదేరి సిగ్గుతోడ దలవంచుకొనెను
(॥ఇంత॥)
సేయరాని వూడిగాలు సేసి సేసి కాతరాన
పాయరాక తొడమీఁదఁ బవ్వళించెను
కాయజకేలికి నిన్ను గమ్మరఁ జిలువఁబూని
ఆయడ చిరునవ్వుతో నట్టె గుక్కుకొనెను
(॥ఇంత॥)
చూపరాని మోమమెల్లాఁ జూపి నిన్ను మెప్పించి
దాపుగా నీరెంటెములో దాఁ జొచ్చెను
యేపున శ్రీవేంకటేశ యీకె యలమేల్మంగ
నీపొందు సేసి తన నేరుపు మెరసెను
(||pallavi||)
iṁtaḍam̐ garam̐gavaddā yichchagiṁchi nī manasu
sĕṁtalam̐ jūsinavāri sittālu garam̐gĕnu
(||iṁta||)
sĕpparāni priyamulu sĕppi nīgu javarālu
vuppadillum̐ damidoḍa nūraguṁḍĕnu
kappurabu bŏmma nīgum̐ gānugagām̐ jedigichchi
dappideri siggudoḍa dalavaṁchugŏnĕnu
(||iṁta||)
seyarāni vūḍigālu sesi sesi kādarāna
pāyarāga tŏḍamīm̐dam̐ bavvaḽiṁchĕnu
kāyajageligi ninnu gammaram̐ jiluvam̐būni
āyaḍa sirunavvudo naṭṭĕ gukkugŏnĕnu
(||iṁta||)
sūbarāni momamĕllām̐ jūbi ninnu mĕppiṁchi
dābugā nīrĕṁṭĕmulo dām̐ jŏchchĕnu
yebuna śhrīveṁkaḍeśha yīgĕ yalamelmaṁga
nībŏṁdu sesi tana nerubu mĕrasĕnu