Imtadam gaani gurudu yimdaru neṟumgaraa

ఇంతటఁ గాని గురుతు యిందరు నెఱుఁగరా
Language

(॥పల్లవి॥)
ఇంతటఁ గాని గురుతు యిందరు నెఱుఁగరా
చెంతల నీవే యింత సేసేటివాఁడవు

(॥ఇంతట॥)
పిప్పియై మేని కస్తూరి బేఁట్లెల్లా రాలఁగాను
యిప్పుడే మేకాంత మాడీ నింతి నీతోను
చప్పటై నీ వీఁపుమీఁద చన్ను లట్టె వొరయఁగా
కొప్పు నీ కేమి దువ్వీని కొలువులోను

(॥ఇంతట॥)
నిగ్గుల నీమీఁదనే నిట్టూర్పులు వారఁగాను
దగ్గర నేల కూచుండీ తరుణి నేఁడు
బగ్గన చేతి చెమట పలుమారు నంటఁగాను
తగ్గక పాదాలు గుద్దీ తా నదేమె ఇప్పుడు

(॥ఇంతట॥)
కొనగోర నీ మోవి గుఱుతుగా నాఁటఁగా
అనువుగా నాకు చుట్టి యందిచ్చీ నీకు
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
తనివోని నవ్వులను తా నేమి మెచ్చీని

(||pallavi||)
iṁtaḍam̐ gāni gurudu yiṁdaru nĕṟum̐garā
sĕṁtala nīve yiṁta seseḍivām̐ḍavu

(||iṁtaḍa||)
pippiyai meni kastūri bem̐ṭlĕllā rālam̐gānu
yippuḍe megāṁta māḍī niṁti nīdonu
sappaḍai nī vīm̐pumīm̐da sannu laṭṭĕ vŏrayam̐gā
kŏppu nī kemi duvvīni kŏluvulonu

(||iṁtaḍa||)
niggula nīmīm̐dane niṭṭūrbulu vāram̐gānu
daggara nela kūsuṁḍī taruṇi nem̐ḍu
baggana sedi sĕmaḍa palumāru naṁṭam̐gānu
taggaga pādālu guddī tā nademĕ ippuḍu

(||iṁtaḍa||)
kŏnagora nī movi guṟudugā nām̐ṭam̐gā
anuvugā nāgu suṭṭi yaṁdichchī nīgu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
tanivoni navvulanu tā nemi mĕchchīni