Imtadaanavauda nem de yeṟimgidime

ఇంతదానవౌత నేఁ డే యెఱిఁగితిమే
Language

(॥పల్లవి॥)
ఇంతదానవౌత నేఁ డే యెఱిఁగితిమే
కాంతుని కిన్నిటా నీవే కలిగితివే

(॥॥)
పచ్చిదేరే మోవిమీఁది పలుకుఁదేనె లొసగ
యిచ్చకురాలవు నీవు యెఱుఁగుదువే
ముచ్చట సెలవినవ్వు ముత్యాలదండలుగట్ట
నిచ్చలానఁ జిన్ననాఁడే నేరిచితివే

(॥॥)
సరుస కనుచూపుల చల్లువెన్నెల గాయించి
తరితీపు చూప నీవే దంట వౌదువే
నిరతి గుబ్బచన్నుల నిమ్మపండ్ల సూడిదెలు
సరవితో నియ్య నీవే జాణవవుదువే

(॥॥)
జిగిమించుంగరముల శ్రీ వేంకటేశు నలమి
మిగులా వలపించఁగ మేఁటివౌదువే
మగఁడు నీవును గూడి మన్నన లిచ్చితి రిట్టె
జగములో మాకేలికసానివిగదవే

(||pallavi||)
iṁtadānavauda nem̐ ḍe yĕṟim̐gidime
kāṁtuni kinniḍā nīve kaligidive

(||||)
pachchidere movimīm̐di palugum̐denĕ lŏsaga
yichchagurālavu nīvu yĕṟum̐guduve
muchchaḍa sĕlavinavvu mutyāladaṁḍalugaṭṭa
nichchalānam̐ jinnanām̐ḍe nerisidive

(||||)
sarusa kanusūbula salluvĕnnĕla gāyiṁchi
taridību sūba nīve daṁṭa vauduve
niradi gubbasannula nimmabaṁḍla sūḍidĕlu
saravido niyya nīve jāṇavavuduve

(||||)
jigimiṁchuṁgaramula śhrī veṁkaḍeśhu nalami
migulā valabiṁcham̐ga mem̐ṭivauduve
magam̐ḍu nīvunu gūḍi mannana lichchidi riṭṭĕ
jagamulo māgeligasānivigadave