Imtadaa neesuddule yemtigi sigguvadevu

ఇంతటా నీసుద్దులే యేఁటికి సిగ్గువడేవు
Language

(॥పల్లవి॥)
ఇంతటా నీసుద్దులే యేఁటికి సిగ్గువడేవు
యెంత లేదు నాకు నిట్టె ఇయ్యవయ్య విడెము

(॥॥)
వినరాదా ఆపె మాట వేడుకలు దై వార
యెనలేని పరాకులు యేలసేసేవు
మునుపే యెరుఁగుదురు ముదితలు నీపొందులు
తనివోక నీవేల దాఁచేవో కాని

(॥॥)
చూడరాదా ఆపెదిక్కు సూటులు దప్పకుండా
తాడుపడి నీ వేల తలవంచేవు
వాడలెల్లా నిండె నీవు వలచినవలపులు
గాడిఁగట్టి నీ వేల కప్పేవో కాని

(॥॥)
వేయరాదా నీచేయి వెక్కసపుఁ జన్నులపై
యీ యెడ శ్రీ వేంకటేశ యేల నవ్వేవు
చాయల నన్నేలితివి సమరితి నా కెవద్ద
నీ యలపు లేమిటికి నెరపేవోకాని

(||pallavi||)
iṁtaḍā nīsuddule yem̐ṭigi sigguvaḍevu
yĕṁta ledu nāgu niṭṭĕ iyyavayya viḍĕmu

(||||)
vinarādā ābĕ māḍa veḍugalu dai vāra
yĕnaleni parāgulu yelasesevu
munube yĕrum̐guduru mudidalu nībŏṁdulu
tanivoga nīvela dām̐sevo kāni

(||||)
sūḍarādā ābĕdikku sūḍulu dappaguṁḍā
tāḍubaḍi nī vela talavaṁchevu
vāḍalĕllā niṁḍĕ nīvu valasinavalabulu
gāḍim̐gaṭṭi nī vela kappevo kāni

(||||)
veyarādā nīseyi vĕkkasabum̐ jannulabai
yī yĕḍa śhrī veṁkaḍeśha yela navvevu
sāyala nannelidivi samaridi nā kĕvadda
nī yalabu lemiḍigi nĕrabevogāni