Imtadaa nee manasu raa deggu lemcha nemti koyi

ఇంతటా నీ మనసు రా దెగ్గు లెంచ నేఁటి కోయి
Language

(॥పల్లవి॥)
ఇంతటా నీ మనసు రా దెగ్గు లెంచ నేఁటి కోయి
చింతతో నుందాన నంటా సిగ్గు వడే వోయీ

(॥ఇంతటా॥)
చిత్తమును నోవకుండా చిన్నఁబోయి వుండకుండా
మెత్తనిమాట లాడితే మే లదే వోయి
కొత్త లెల్లఁ దొఁచకుండా గుట్ట నీకుఁ జెడకుండా
పొత్తుల నవ్వు నవ్వితి పూఁచి మెచ్చ వోయి

(॥ఇంతటా॥)
జగడాలు రాకుండా చనవునుఁ దప్పకుండా
సగముచూపు చూచితి చాలదా వోయి
తగులమిఁ బాయకుండా తప్పు నీపైఁ జేయకుండా
మొగము వంచితి నే నీ ముందరనె వోయి

(॥ఇంతటా॥)
నింద నీపై మోయకుండా నేమమూనుఁ దప్పకుండా
అంది నేఁ బరా కైతి నప్పడే వోయి
కందువ శ్రీవెంకటేశ కాఁగిలించితివి నన్ను
చంద మాయ నిద్దరికి సరి లేదు వోయి

(||pallavi||)
iṁtaḍā nī manasu rā dĕggu lĕṁcha nem̐ṭi koyi
siṁtado nuṁdāna naṁṭā siggu vaḍe voyī

(||iṁtaḍā||)
sittamunu novaguṁḍā sinnam̐boyi vuṁḍaguṁḍā
mĕttanimāḍa lāḍide me lade voyi
kŏtta lĕllam̐ dŏm̐saguṁḍā guṭṭa nīgum̐ jĕḍaguṁḍā
pŏttula navvu navvidi pūm̐si mĕchcha voyi

(||iṁtaḍā||)
jagaḍālu rāguṁḍā sanavunum̐ dappaguṁḍā
sagamusūbu sūsidi sāladā voyi
tagulamim̐ bāyaguṁḍā tappu nībaim̐ jeyaguṁḍā
mŏgamu vaṁchidi ne nī muṁdaranĕ voyi

(||iṁtaḍā||)
niṁda nībai moyaguṁḍā nemamūnum̐ dappaguṁḍā
aṁdi nem̐ barā kaidi nappaḍe voyi
kaṁduva śhrīvĕṁkaḍeśha kām̐giliṁchidivi nannu
saṁda māya niddarigi sari ledu voyi