ఇంతట వరమీవయ్యా ఇంతిపాలి దేవరవు
(॥పల్లవి॥)
ఇంతట వరమీవయ్యా ఇంతిపాలి దేవరవు
మంతనాన నీకుఁగానే మరు నోము నోమెను
(॥ఇంత॥)
తలపోఁతవలపులు తనకు ఫలించుదాఁకా
మెలుఁత చన్నులు నీకు మీఁదుగట్టెను
తొలుతనే విరహానఁ దురుము వీడెఁ గనక
తలకిందుగా నెరులఁ దపము సేయించెను
(॥ఇంత॥)
వెలయఁగ వలరాచవిద్యలు నేరుపుమని
పలుకుఁదేనియ నీకు వార మిచ్చెను
పలుచెమట లేరులు పై పై నుబ్బెఁ గనక
నలిఁ దనువల్లి పుణ్యనదుల నోలార్చెను
(॥ఇంత॥)
కాతరాన నీకాఁగిట గరిడిసాము చేసి
చేతులెత్తి నీకు మొక్కు చెల్లించెను
యీతల శ్రీవేంకటేశ యీ కెలమేల్‌మంగ గన
ఆతుమారా నీయధరామృతము గొనెను
(||pallavi||)
iṁtaḍa varamīvayyā iṁtibāli devaravu
maṁtanāna nīgum̐gāne maru nomu nomĕnu
(||iṁta||)
talabom̐tavalabulu tanagu phaliṁchudām̐kā
mĕlum̐ta sannulu nīgu mīm̐dugaṭṭĕnu
tŏludane virahānam̐ durumu vīḍĕm̐ ganaga
talagiṁdugā nĕrulam̐ dabamu seyiṁchĕnu
(||iṁta||)
vĕlayam̐ga valarāsavidyalu nerubumani
palugum̐deniya nīgu vāra michchĕnu
palusĕmaḍa lerulu pai pai nubbĕm̐ ganaga
nalim̐ danuvalli puṇyanadula nolārsĕnu
(||iṁta||)
kādarāna nīgām̐giḍa gariḍisāmu sesi
sedulĕtti nīgu mŏkku sĕlliṁchĕnu
yīdala śhrīveṁkaḍeśha yī kĕlamelmaṁga gana
ādumārā nīyadharāmṛtamu gŏnĕnu