ఇంతట నైన మన్నించు యేల జోలిఁ బెట్టేవు
(॥పల్లవి॥)
ఇంతట నైన మన్నించు యేల జోలిఁ బెట్టేవు
చెంతల నీ చెప్పినట్టు సేయనట్టి దాననా
(॥॥)
యేరా మమ్మే సుద్దులెందాఁకా నడిగేవు
గారవించి నీగుట్టించుకయుఁ జెప్పవు
సారెసారెకు నీతో చలపాదితనమేల
ఔరా నీవన్నట్టే అన్నిసుద్దులు
(॥॥)
లేలే యెందాఁకా నన్నాలించి మనసరసేవు
యేలాగులా నీగుణా లెఱఁగనీవు
శాలామాలములై న చయ్యాటము నీతో నేల
మేలే నీసేఁతలెల్లా మెచ్చితినే
(॥॥)
కాని నాచన్నులైతే గట్లంటాఁ బిసికేవు
ఆనుక గోరనూఁదితే అంటనియ్యవు
పూని శ్రీవేంకటేశ్వర పొసఁగ నన్నేలితివి
నేనే నీవైనది నిజమాయ నిప్పుడు
(||pallavi||)
iṁtaḍa naina manniṁchu yela jolim̐ bĕṭṭevu
sĕṁtala nī sĕppinaṭṭu seyanaṭṭi dānanā
(||||)
yerā mamme suddulĕṁdām̐kā naḍigevu
gāraviṁchi nīguṭṭiṁchugayum̐ jĕppavu
sārĕsārĕgu nīdo salabādidanamela
aurā nīvannaṭṭe annisuddulu
(||||)
lele yĕṁdām̐kā nannāliṁchi manasarasevu
yelāgulā nīguṇā lĕṟam̐ganīvu
śhālāmālamulai na sayyāḍamu nīdo nela
mele nīsem̐talĕllā mĕchchidine
(||||)
kāni nāsannulaide gaṭlaṁṭām̐ bisigevu
ānuga goranūm̐dide aṁṭaniyyavu
pūni śhrīveṁkaḍeśhvara pŏsam̐ga nannelidivi
nene nīvainadi nijamāya nippuḍu