ఇంతట మన్నించరాదా యేరా నీవు
(॥పల్లవి॥)
ఇంతట మన్నించరాదా యేరా నీవు
మంతుకెక్కెనా నీ మగతనమిపుడే
(॥ఇంతట॥)
మౌనాననుండినవారి మాటలాడించ వచ్చేవు
కానవు మాలోని చింత కట్టా నీవు
వూని నీకునిప్పుడింత వుల్లాసమెత్తితేను
మానినులకుఁ బండెనా మరియు నీచేతను
(॥ఇంతట॥)
వూరకే వుండిన వారినొడలు ముట్ట వచ్చేవు
యేరా నన్నడుగవు యించుకంతాను
భారపు నీజవ్వనము పట్టరాక వుండితేను
యీరీతినింతుల మీఁద నిటు చూపువలెనా
(॥ఇంతట॥)
వొద్దికి వచ్చినవారినొడివట్టి తీసేవు
పొద్దెరఁగవిటు నన్నుఁ గొసరుతాను
అద్దిరా శ్రీవేంకటేశ అంతలోనే గూడితివి
వుద్దండపు నీవలపు వువిదల భాగ్యమా
(||pallavi||)
iṁtaḍa manniṁcharādā yerā nīvu
maṁtugĕkkĕnā nī magadanamibuḍe
(||iṁtaḍa||)
maunānanuṁḍinavāri māḍalāḍiṁcha vachchevu
kānavu māloni siṁta kaṭṭā nīvu
vūni nīgunippuḍiṁta vullāsamĕttidenu
māninulagum̐ baṁḍĕnā mariyu nīsedanu
(||iṁtaḍa||)
vūrage vuṁḍina vārinŏḍalu muṭṭa vachchevu
yerā nannaḍugavu yiṁchugaṁtānu
bhārabu nījavvanamu paṭṭarāga vuṁḍidenu
yīrīdiniṁtula mīm̐da niḍu sūbuvalĕnā
(||iṁtaḍa||)
vŏddigi vachchinavārinŏḍivaṭṭi tīsevu
pŏddĕram̐gaviḍu nannum̐ gŏsarudānu
addirā śhrīveṁkaḍeśha aṁtalone gūḍidivi
vuddaṁḍabu nīvalabu vuvidala bhāgyamā