Imtada mannimcharaadaa yemayyaa

ఇంతట మన్నించరాదా యేమయ్యా
Language

(॥పల్లవి॥)
ఇంతట మన్నించరాదా యేమయ్యా
వింతసేయ కిఁకనైనా విచ్చేయవయ్యా

(॥ఇంత॥)
వేడుకతో వచ్చేవంటా వెలఁది గాచుకున్నది
యాడ నేమిసేసేవు యేమయ్యా
యేడలేని పనులును యెన్నైనాఁ గలవు నీకు
వీడె మందుకొందువు విచ్చేయవయ్యా

(॥ఇంత॥)
అందందే చెలులనెల్లా నంపె నిన్నుఁ బిలువఁగ
యెందాఁకా నవ్వులు నవ్వే వేమయ్యా
సందడిఁ గొలువుసేసే సతులు దరచు నీకు
విందారగింతువుగాని విచ్చేయవయ్యా

(॥ఇంత॥)
మనసు నీపై నిలిపి మరిగి యెదు రుచూచీ
యెనయరాదా యిట్టె యేమయ్యా
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసితి వింటిలోన
వినయము చేకొందువు విచ్చేయవయ్యా

(||pallavi||)
iṁtaḍa manniṁcharādā yemayyā
viṁtaseya kim̐kanainā vichcheyavayyā

(||iṁta||)
veḍugado vachchevaṁṭā vĕlam̐di gāsugunnadi
yāḍa nemisesevu yemayyā
yeḍaleni panulunu yĕnnainām̐ galavu nīgu
vīḍĕ maṁdugŏṁduvu vichcheyavayyā

(||iṁta||)
aṁdaṁde sĕlulanĕllā naṁpĕ ninnum̐ biluvam̐ga
yĕṁdām̐kā navvulu navve vemayyā
saṁdaḍim̐ gŏluvusese sadulu darasu nīgu
viṁdāragiṁtuvugāni vichcheyavayyā

(||iṁta||)
manasu nībai nilibi marigi yĕdu rusūsī
yĕnayarādā yiṭṭĕ yemayyā
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalasidi viṁṭilona
vinayamu segŏṁduvu vichcheyavayyā