ఇంతట లాలించవయ్యా ఇంతిఁ గాఁగిలించుకొని
(॥పల్లవి॥)
ఇంతట లాలించవయ్యా ఇంతిఁ గాఁగిలించుకొని
చింతతోడి వేడుకలఁ జెలఁగీ లోలోనను
(॥ఇంత॥)
సముకాన నిలుచుండి చాయాలా సన్నలాఁ జూచి
చెమట గోరఁ జిమ్మీ చెలి నీపైని
తమక మెటువంటిదో తలపోఁతవలపులు
వుమురుకూటములై వున్నవి లోలోనను
(॥ఇంత॥)
తెరలోనే వేగించి తియ్యనిమోవితేనె
గురిసీ సారె సారెఁ గొమ్మ నీపైని
సురతపుఁగాంక్ష లెంతో చూపు చెప్పరానిమాట
లరుదుగా గుబ్బతిల్లీ నదివో లోలోనను
(॥ఇంత॥)
పానుపుపైఁ బవ్వళించి పచ్చిచేఁతలఁ జన్నులు
కానుకిచ్చి బత్తిసేసీఁ గాంత నీపైని
పూని శ్రీవేంకటేశ నేర్పులెట్టో తరితీపు
నాని పెక్కుభావములు ననిచీ లోలోనను
(||pallavi||)
iṁtaḍa lāliṁchavayyā iṁtim̐ gām̐giliṁchugŏni
siṁtadoḍi veḍugalam̐ jĕlam̐gī lolonanu
(||iṁta||)
samugāna nilusuṁḍi sāyālā sannalām̐ jūsi
sĕmaḍa goram̐ jimmī sĕli nībaini
tamaga mĕḍuvaṁṭido talabom̐tavalabulu
vumurugūḍamulai vunnavi lolonanu
(||iṁta||)
tĕralone vegiṁchi tiyyanimovidenĕ
gurisī sārĕ sārĕm̐ gŏmma nībaini
suradabum̐gāṁkṣha lĕṁto sūbu sĕpparānimāḍa
larudugā gubbadillī nadivo lolonanu
(||iṁta||)
pānububaim̐ bavvaḽiṁchi pachchisem̐talam̐ jannulu
kānugichchi battisesīm̐ gāṁta nībaini
pūni śhrīveṁkaḍeśha nerbulĕṭṭo taridību
nāni pĕkkubhāvamulu nanisī lolonanu