ఇంతా నీపై మోహమే యెరఁగ విన్నవించితి
(॥పల్లవి॥)
ఇంతా నీపై మోహమే యెరఁగ విన్నవించితి
పంతముతో నెగ్గుగాను పట్టవద్దు సుమ్మీ
(॥ఇంతా॥)
నెలకొని నీమీఁద నేరము లేకుండినాను
వెలఁదిఁ గనక నిన్ను వెంగె మాడుదు
యెలమి నీవు నీకు యెంత చనవిచ్చినాను
కొలఁది మీర నప్పటిఁ గొసరుదును
(॥ఇంతా॥)
బడి వాయ కెప్పుడును పక్క నీవు వుండినాను
వొడలెల్లా సోదింతు నూరకె నిన్ను
జడియక నీవెంత సారెఁ గూడినాను
తడయక చెయి చాఁతుఁ దనియక నేను
(॥ఇంతా॥)
యెనసినసరసము లెంత నీవు నెరపినా
చెనకుదు నీమేను చిరునవ్వుతో
ఘనుఁడ శ్రీవేంకటేశ కాఁగిట నన్నేలితివి
వినయములే సేతు వేమారు నీకు
(||pallavi||)
iṁtā nībai mohame yĕram̐ga vinnaviṁchidi
paṁtamudo nĕggugānu paṭṭavaddu summī
(||iṁtā||)
nĕlagŏni nīmīm̐da neramu leguṁḍinānu
vĕlam̐dim̐ ganaga ninnu vĕṁgĕ māḍudu
yĕlami nīvu nīgu yĕṁta sanavichchinānu
kŏlam̐di mīra nappaḍim̐ gŏsarudunu
(||iṁtā||)
baḍi vāya kĕppuḍunu pakka nīvu vuṁḍinānu
vŏḍalĕllā sodiṁtu nūragĕ ninnu
jaḍiyaga nīvĕṁta sārĕm̐ gūḍinānu
taḍayaga sĕyi sām̐tum̐ daniyaga nenu
(||iṁtā||)
yĕnasinasarasamu lĕṁta nīvu nĕrabinā
sĕnagudu nīmenu sirunavvudo
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kām̐giḍa nannelidivi
vinayamule sedu vemāru nīgu