Imtaa ne neramganaa yeraa neevu

ఇంతా నే నెరఁగనా యేరా నీవు
Language

(॥పల్లవి॥)
ఇంతా నే నెరఁగనా యేరా నీవు
వింతలు చూపు నన్ను వెఱ్ఱిఁ జేసేకొరకా

(॥ఇంతా॥)
నిండు రాజసముతోడ నీకు నీకే వచ్చి నా-
యండనే కూచుండేవు అవురా నీవు
చండిపెట్టి నీ తొల్లిటి సతులకునిది చూపి
దిండుకట్ట నన్ను నీవు తిట్టించేటికొరకా

(॥ఇంతా॥)
బత్తిగల వానివలె పడఁతులలోననెల్ల
హత్తి నాకుఁ గొప్పు వెట్టేవవురా నీవు
కొత్తసతులెల్లఁ జూచి గుట్టులే దీయాఁటది
చిత్తిణిగుణముదంటా చీయనేటికొరకా

(॥ఇంతా॥)
వెక్కసపుఁ దమకాన వేగిరించి కాలు దొక్కి
యిక్కువలంటఁగ వచ్చేవేరా నీవు
మిక్కిలి శ్రీవేంకటేశ మించి నన్నుఁ గూడితివి
తక్కిన సవతులెల్లాఁ దలవంచేకొరకా

(||pallavi||)
iṁtā ne nĕram̐ganā yerā nīvu
viṁtalu sūbu nannu vĕṭrim̐ jesegŏragā

(||iṁtā||)
niṁḍu rājasamudoḍa nīgu nīge vachchi nā-
yaṁḍane kūsuṁḍevu avurā nīvu
saṁḍibĕṭṭi nī tŏlliḍi sadulagunidi sūbi
diṁḍugaṭṭa nannu nīvu tiṭṭiṁcheḍigŏragā

(||iṁtā||)
battigala vānivalĕ paḍam̐tulalonanĕlla
hatti nāgum̐ gŏppu vĕṭṭevavurā nīvu
kŏttasadulĕllam̐ jūsi guṭṭule dīyām̐ṭadi
sittiṇiguṇamudaṁṭā sīyaneḍigŏragā

(||iṁtā||)
vĕkkasabum̐ damagāna vegiriṁchi kālu dŏkki
yikkuvalaṁṭam̐ga vachcheverā nīvu
mikkili śhrīveṁkaḍeśha miṁchi nannum̐ gūḍidivi
takkina savadulĕllām̐ dalavaṁchegŏragā