Imta yichchagamu leni demti yaamtadi

ఇంత యిచ్చకము లేని దేఁటి యాఁటది
Language

(॥పల్లవి॥)
ఇంత యిచ్చకము లేని దేఁటి యాఁటది
అంతటికిఁ దగుదువు అవునే యీతనికి

(॥ఇంత॥)
దవ్వులనుండి విభుఁడు తమలము చూపితేను
అవ్వల నోరొగ్గితివి అవునే నీవు
చివ్వన వచ్చి యతఁడు చేవట్టి నిన్నుఁ దీసితే
పువ్వువలె సులభానఁ బోతి వౌనే వెంటను

(॥ఇంత॥)
నెప్పునఁ దామరఁ గొని నిన్నువేసితేఁ గొప్పున-
నప్పుడే ముడుచుకొంటి వౌనే నీవు
చొప్పులుగాఁ గొనగోరు చూపుతే నీచన్నులపైఁ
గప్పిన పయ్యెద దీసి కడు నొడ్డేవే

(॥ఇంత॥)
శ్రీ వేంకటేశుఁడు నీకుచ్చెలపైఁ జేయి వేసితే
ఆవేళఁ గాఁగిట నించే వౌనే నీవు
మోవిగంటి సేయఁగాను ముదమునఁ జెలఁగేవు
ఆవేళ నలమేల్‌మంగ వమరునే నీకును

(||pallavi||)
iṁta yichchagamu leni dem̐ṭi yām̐ṭadi
aṁtaḍigim̐ daguduvu avune yīdanigi

(||iṁta||)
davvulanuṁḍi vibhum̐ḍu tamalamu sūbidenu
avvala norŏggidivi avune nīvu
sivvana vachchi yadam̐ḍu sevaṭṭi ninnum̐ dīside
puvvuvalĕ sulabhānam̐ bodi vaune vĕṁṭanu

(||iṁta||)
nĕppunam̐ dāmaram̐ gŏni ninnuvesidem̐ gŏppuna-
nappuḍe muḍusugŏṁṭi vaune nīvu
sŏppulugām̐ gŏnagoru sūbude nīsannulabaim̐
gappina payyĕda dīsi kaḍu nŏḍḍeve

(||iṁta||)
śhrī veṁkaḍeśhum̐ḍu nīguchchĕlabaim̐ jeyi veside
āveḽam̐ gām̐giḍa niṁche vaune nīvu
movigaṁṭi seyam̐gānu mudamunam̐ jĕlam̐gevu
āveḽa nalamel‌maṁga vamarune nīgunu