Imta yeṟumgaga vunnavemti pomdulu

ఇంత యెఱుఁగక వున్నవేఁటి పొందులు
Language

(॥పల్లవి॥)
ఇంత యెఱుఁగక వున్నవేఁటి పొందులు
చింతామణులు సుండి చెలుల కరుణలు

(॥ఇంత॥)
యెడసిన ప్రియురాలు యింటికివచ్చుటే పో
తొడరి వలపునకుఁ దుదిపదము
కడఁగి యప్పటి నాకె కన్నులఁ జూచుటే పో
వడిఁ దనపాయము వన్నె కిక్కుటా

(॥ఇంత॥)
మచ్చికైన తనకాంత మాటలాడినదే పో
వచ్చిరతులసొబగు పంట వండుటా
గచ్చుల నాకె దగ్గరి కౌఁగిలించుటే పో
ముచ్చటల మొగజన్మమునకు శేఖరము

(॥ఇంత॥)
ముంచినట్టి తనసతి మోవితీపు లిచ్చుటే పో
నించినకోరికలకు నిచ్చవిందులు
యెంచఁగ శ్రీవేంకటేశు నీపె యిట్టె కలసెను
మించినతమకముల మేలు మీఁది మేలులూ

(||pallavi||)
iṁta yĕṟum̐gaga vunnavem̐ṭi pŏṁdulu
siṁtāmaṇulu suṁḍi sĕlula karuṇalu

(||iṁta||)
yĕḍasina priyurālu yiṁṭigivachchuḍe po
tŏḍari valabunagum̐ dudibadamu
kaḍam̐gi yappaḍi nāgĕ kannulam̐ jūsuḍe po
vaḍim̐ danabāyamu vannĕ kikkuḍā

(||iṁta||)
machchigaina tanagāṁta māḍalāḍinade po
vachchiradulasŏbagu paṁṭa vaṁḍuḍā
gachchula nāgĕ daggari kaum̐giliṁchuḍe po
muchchaḍala mŏgajanmamunagu śhekharamu

(||iṁta||)
muṁchinaṭṭi tanasadi movidību lichchuḍe po
niṁchinagorigalagu nichchaviṁdulu
yĕṁcham̐ga śhrīveṁkaḍeśhu nībĕ yiṭṭĕ kalasĕnu
miṁchinadamagamula melu mīm̐di melulū