ఇంత యెరఁగనియట్టి యెడ్డనా నేను
(॥పల్లవి॥)
ఇంత యెరఁగనియట్టి యెడ్డనా నేను
కాంతుఁడ నీ వంతేసి గరిసించ నేఁటికి
(॥ఇంత॥)
సిగ్గు వడి వొకమాఁట చింతతోడ నొకమాఁట
వెగ్గళించి నిన్ను నాడ వెఱ్ఱిదాననా
అగ్గలపుమోహ మైతే అన్నియు నమరుఁ గాక
దగ్గరి నప్పుడె నీతోఁ దమకించఁ దగునా
(॥ఇంత॥)
కన్నప్పుడే మొక్కులూను కాన కున్నఁ దక్కులును
పన్ని యింత నేయ నీకుఁ బగదానవా
మన్నించినవారితోడ మందెమేళ మింపు గాక
నిన్న నేటిలోనకే నిన్ను దూరఁ జెల్లునా
(॥ఇంత॥)
మూల నుండి వొకవాని ముంగిట నొకవావియు
గోల నై చెప్పుక రాను కూళదాననా
యీలాగుల శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
వేళగా కిందాఁక నిన్ను వేసరించ వచ్చునా
(||pallavi||)
iṁta yĕram̐ganiyaṭṭi yĕḍḍanā nenu
kāṁtum̐ḍa nī vaṁtesi garisiṁcha nem̐ṭigi
(||iṁta||)
siggu vaḍi vŏgamām̐ṭa siṁtadoḍa nŏgamām̐ṭa
vĕggaḽiṁchi ninnu nāḍa vĕṭridānanā
aggalabumoha maide anniyu namarum̐ gāga
daggari nappuḍĕ nīdom̐ damagiṁcham̐ dagunā
(||iṁta||)
kannappuḍe mŏkkulūnu kāna kunnam̐ dakkulunu
panni yiṁta neya nīgum̐ bagadānavā
manniṁchinavāridoḍa maṁdĕmeḽa miṁpu gāga
ninna neḍilonage ninnu dūram̐ jĕllunā
(||iṁta||)
mūla nuṁḍi vŏgavāni muṁgiḍa nŏgavāviyu
gola nai sĕppuga rānu kūḽadānanā
yīlāgula śhrīvĕṁkaḍeśha nannum̐ gūḍidivi
veḽagā kiṁdām̐ka ninnu vesariṁcha vachchunā