ఇంత యేలే దోషమూ ఇన్నిటా ఘనుఁడు దాను
(॥పల్లవి॥)
ఇంత యేలే దోషమూ ఇన్నిటా ఘనుఁడు దాను
అంతలో నా కాళ్లేల అంటవచ్చీని
(॥ఇంత॥)
మచ్చరము మానితివనే మంకులు విడిచితినే
చెచ్చెర నీచెప్పినట్టు సేసేనే
ఇచ్చకములాడేనే ఇంక నేమీ నననే
ఇచ్చట నాకేల పంతా లియ్యవచ్చీనే
(॥ఇంత॥)
చలములు మానితివనే జవదాఁటనే ఇఁక
పలికినట్టే నేనూఁ బలికేనే
వలపు గానుకిచ్చేనే వాదు లడువనే ఇఁక
బలవంతమున నేల బాసలిచ్చీనే
(॥ఇంత॥)
తప్పు లిఁకఁ బట్టనే తనమాట గాదననే
యెప్పుడూఁ దనమన్నన లియ్యకొనేనే
వొప్పుగా శ్రీవేంకటేశుఁ డొనగూడె నన్ను నిట్టె
యిప్పుడే యెంగిలిమో వేలడిగినే
(||pallavi||)
iṁta yele doṣhamū inniḍā ghanum̐ḍu dānu
aṁtalo nā kāḽlela aṁṭavachchīni
(||iṁta||)
machcharamu mānidivane maṁkulu viḍisidine
sĕchchĕra nīsĕppinaṭṭu sesene
ichchagamulāḍene iṁka nemī nanane
ichchaḍa nāgela paṁtā liyyavachchīne
(||iṁta||)
salamulu mānidivane javadām̐ṭane im̐ka
paliginaṭṭe nenūm̐ baligene
valabu gānugichchene vādu laḍuvane im̐ka
balavaṁtamuna nela bāsalichchīne
(||iṁta||)
tappu lim̐kam̐ baṭṭane tanamāḍa gādanane
yĕppuḍūm̐ danamannana liyyagŏnene
vŏppugā śhrīveṁkaḍeśhum̐ ḍŏnagūḍĕ nannu niṭṭĕ
yippuḍe yĕṁgilimo velaḍigine