Imta yela daamsevu nemerimgide nemaaya

ఇంత యేల దాఁచేవు నేమెరిఁగితే నేమాయ
Language

(॥పల్లవి॥)
ఇంత యేల దాఁచేవు నేమెరిఁగితే నేమాయ
పంతాలకే కాదా నిన్నుఁ బచ్చి సేసేది

(॥ఇంత॥)
తరితీపులకెకాదా తరుణి నీవద్ద నుండి
పరి పరి విధముల పందె మాడేది
వొరటులకే కాదా వొడివట్టి తీసి నిన్ను
సరసములాడుతానే జంకించేది

(॥ఇంత॥)
పెద్దరికాలకెకాదా పెనఁగులాడుతా నిన్ను
గద్దించి నవ్వులు నవ్వి కాఁగిలించేది
వుద్దండాలకే కాదా వోరికొట్లను నిన్ను
పెద్దబెట్టుగా నూరకె పేరఁబిలిచేది

(॥ఇంత॥)
యెమ్మెలకేకాదా రతి నెనసి యలమేల్మంగ
వుమ్మడిఁ బాయక కొలువులుసేసేది
నెమ్మది శ్రీ వేంకటేశ నీవు నన్ను వేలితివి
ముమ్మాటికి గాదా నీ మోము చూచేది

(||pallavi||)
iṁta yela dām̐sevu nemĕrim̐gide nemāya
paṁtālage kādā ninnum̐ bachchi sesedi

(||iṁta||)
taridībulagĕgādā taruṇi nīvadda nuṁḍi
pari pari vidhamula paṁdĕ māḍedi
vŏraḍulage kādā vŏḍivaṭṭi tīsi ninnu
sarasamulāḍudāne jaṁkiṁchedi

(||iṁta||)
pĕddarigālagĕgādā pĕnam̐gulāḍudā ninnu
gaddiṁchi navvulu navvi kām̐giliṁchedi
vuddaṁḍālage kādā vorigŏṭlanu ninnu
pĕddabĕṭṭugā nūragĕ peram̐bilisedi

(||iṁta||)
yĕmmĕlagegādā radi nĕnasi yalamelmaṁga
vummaḍim̐ bāyaga kŏluvulusesedi
nĕmmadi śhrī veṁkaḍeśha nīvu nannu velidivi
mummāḍigi gādā nī momu sūsedi