Imta virahaagniseda nela veragamdidivi

ఇంత విరహాగ్నిచేత నేల వెరగందితివి
Language

(॥పల్లవి॥)
ఇంత విరహాగ్నిచేత నేల వెరగందితివి
చింతదీర మా దిక్కు చిత్తగించఁగదవే

(॥ఇంత॥)
మానిని నీరమణుఁడు మాటలాడినట్లయ్యీ
వీనుల నీ వాలకించి వినఁగదవే
పానుపుపై నాతఁడు నీపక్కనే వున్నాఁడోయోమో
చేనంటి నీ విప్పు డిట్టె చెనకఁగఁగదవే

(॥ఇంత॥)
కచ్చుపెట్టి వాకిటఁ గడుచప్పుడయ్యాని
వచ్చీఁ బేరుకొని పిలువఁగగఁదవే
చొచ్చి సోరణగండ్లఁ జూచుకొంటావున్నాఁడేమో
తచ్చి సెలవుల నీవింతట నవ్వఁగదవే

(॥ఇంత॥)
గక్కన యెందుండోవచ్చి కాఁగిలించి నిన్నుఁ గూడె
వొక్కమనసున నిఁక నుండఁగదవే
అక్కరో శ్రీవేంకటేశుఁ డలమేల్ మంగవు నీవు
చక్కఁగా మావిన్నపాలు సరివచ్చెఁగదవే

(||pallavi||)
iṁta virahāgniseda nela vĕragaṁdidivi
siṁtadīra mā dikku sittagiṁcham̐gadave

(||iṁta||)
mānini nīramaṇum̐ḍu māḍalāḍinaṭlayyī
vīnula nī vālagiṁchi vinam̐gadave
pānububai nādam̐ḍu nībakkane vunnām̐ḍoyomo
senaṁṭi nī vippu ḍiṭṭĕ sĕnagam̐gam̐gadave

(||iṁta||)
kachchubĕṭṭi vāgiḍam̐ gaḍusappuḍayyāni
vachchīm̐ berugŏni piluvam̐gagam̐dave
sŏchchi soraṇagaṁḍlam̐ jūsugŏṁṭāvunnām̐ḍemo
tachchi sĕlavula nīviṁtaḍa navvam̐gadave

(||iṁta||)
gakkana yĕṁduṁḍovachchi kām̐giliṁchi ninnum̐ gūḍĕ
vŏkkamanasuna nim̐ka nuṁḍam̐gadave
akkaro śhrīveṁkaḍeśhum̐ ḍalamel maṁgavu nīvu
sakkam̐gā māvinnabālu sarivachchĕm̐gadave