Imta veṟabumaṟabu lemtigi neegu

ఇంత వెఱపుమఱపు లేఁటికి నీకు
Language

(॥పల్లవి॥)
ఇంత వెఱపుమఱపు లేఁటికి నీకు
కాంతలు పెక్కుగలుగు ఘనుఁడవు నీవు

(॥ఇంత॥)
చెక్కులు నిన్ను నొక్కితే సిగ్గులువడుదురా
చొక్కపుచూపుల నన్ను చూతువు గాక
గక్కున చేయివేసితే కడుఁజెమరింతురా
ఇక్కువ లంటి నన్ను యెచ్చరింతువు గాక

(॥ఇంత॥)
నిన్ను సోఁకనాడితేను నివ్వెరగందుదురా
అన్నిటాను నాకు లోనవుదువుగాక
సన్నలు సేసితేనే జల్లనఁ బులకింతురా
మన్నించి నాతో మారుమలతువుగాక

(॥ఇంత॥)
వొద్దికై నేఁ గూడితేను వూరకె భ్రమతురా
చద్దివేఁడివలపులు చల్లుదుగాక
అద్దో శ్రీవేంకటేశ ఆలనైతి నీకు నేను
పొద్దువొద్దు రతులను భోగింతువుగాక

(||pallavi||)
iṁta vĕṟabumaṟabu lem̐ṭigi nīgu
kāṁtalu pĕkkugalugu ghanum̐ḍavu nīvu

(||iṁta||)
sĕkkulu ninnu nŏkkide sigguluvaḍudurā
sŏkkabusūbula nannu sūduvu gāga
gakkuna seyiveside kaḍum̐jĕmariṁturā
ikkuva laṁṭi nannu yĕchchariṁtuvu gāga

(||iṁta||)
ninnu som̐kanāḍidenu nivvĕragaṁdudurā
anniḍānu nāgu lonavuduvugāga
sannalu sesidene jallanam̐ bulagiṁturā
manniṁchi nādo mārumaladuvugāga

(||iṁta||)
vŏddigai nem̐ gūḍidenu vūragĕ bhramadurā
saddivem̐ḍivalabulu salludugāga
addo śhrīveṁkaḍeśha ālanaidi nīgu nenu
pŏdduvŏddu radulanu bhogiṁtuvugāga