ఇంత వెఱపేల నీ యిచ్చ రాజవు
(॥పల్లవి॥)
ఇంత వెఱపేల నీ యిచ్చ రాజవు
పంతముమెరసి నిన్నుఁ బంగించమా
(॥ఇంత॥)
చేసినచేఁతలు నీకు చెల్లవలెనని వట్టి
బాసలు సేయుమీ పలుమారును
సేసవెట్టితివి తొల్లె చేకొంటివి నీ వారము
యేసుద్దులు గలిగినా యెగ్గు లెంచేమా
(॥ఇంత॥)
మనసున నీ పనులు మఱవవలసి నాకు
వినయాలు సేయకుమీ వెల్లవిరిగా
వొనరఁ నేఁ జిన్ననాటనుండి నీ కిచ్చకురాల
నినుఁ జూచి నేరము లెంచేమా
(॥ఇంత॥)
సురతములో నిన్నక్కడిచొప్పు లెత్తకుండాను
పరవశ జేయకుమీ పక్కన నన్ను
నిరతి శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
గరిమ నన్నేలితివి కాకుసేసేమా
(||pallavi||)
iṁta vĕṟabela nī yichcha rājavu
paṁtamumĕrasi ninnum̐ baṁgiṁchamā
(||iṁta||)
sesinasem̐talu nīgu sĕllavalĕnani vaṭṭi
bāsalu seyumī palumārunu
sesavĕṭṭidivi tŏllĕ segŏṁṭivi nī vāramu
yesuddulu galiginā yĕggu lĕṁchemā
(||iṁta||)
manasuna nī panulu maṟavavalasi nāgu
vinayālu seyagumī vĕllavirigā
vŏnaram̐ nem̐ jinnanāḍanuṁḍi nī kichchagurāla
ninum̐ jūsi neramu lĕṁchemā
(||iṁta||)
suradamulo ninnakkaḍisŏppu lĕttaguṁḍānu
paravaśha jeyagumī pakkana nannu
niradi śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
garima nannelidivi kāgusesemā