Imta vellaviri gaddaa imtula valabu lellaa

ఇంత వెల్లవిరి గద్దా ఇంతుల వలపు లెల్లా
Language

(॥పల్లవి॥)
ఇంత వెల్లవిరి గద్దా ఇంతుల వలపు లెల్లా
కాంతునికి నొప్పగించి కాకు సేసేవూ

(॥ఇంత॥)
అందుపుఁజెక్కులతోడి యలమేలుమంగ నీ
వంది కైలా గియ్యవయ్య ఆతినికిని
కందువ కన్నులఁ జూచె కరఁగి వుందానవు
యిందుకే యీతఁడు నవ్వీ నిది గదవమ్మా

(॥ఇంత॥)
బంగారువన్నెలతోడిపడఁతి
సంగతి నీపతికొప్పు చక్కఁ బెట్టవో
ముంగిట నాతఁ డుంటెనె మురిసేవూ
చెంగట నాతఁ డేసుద్ది చెప్పీఁ జెలులకూ

(॥ఇంత॥)
కప్పురపువాసనకలికి
యిప్పుడె శ్రీవెంకటేశు నెనసితివి
తప్పక చూచి మఱియుఁ దమకించేవూ ఆతఁ
డప్పటి నిందుకు లో నాయఁ గదవమ్మా

(||pallavi||)
iṁta vĕllaviri gaddā iṁtula valabu lĕllā
kāṁtunigi nŏppagiṁchi kāgu sesevū

(||iṁta||)
aṁdubum̐jĕkkuladoḍi yalamelumaṁga nī
vaṁdi kailā giyyavayya ādinigini
kaṁduva kannulam̐ jūsĕ karam̐gi vuṁdānavu
yiṁduge yīdam̐ḍu navvī nidi gadavammā

(||iṁta||)
baṁgāruvannĕladoḍibaḍam̐ti
saṁgadi nībadigŏppu sakkam̐ bĕṭṭavo
muṁgiḍa nādam̐ ḍuṁṭĕnĕ murisevū
sĕṁgaḍa nādam̐ ḍesuddi sĕppīm̐ jĕlulagū

(||iṁta||)
kappurabuvāsanagaligi
yippuḍĕ śhrīvĕṁkaḍeśhu nĕnasidivi
tappaga sūsi maṟiyum̐ damagiṁchevū ādam̐
ḍappaḍi niṁdugu lo nāyam̐ gadavammā