ఇంత వేగిరకత్తెనా యెఱఁగనా నేనేమైనా
(॥పల్లవి॥)
ఇంత వేగిరకత్తెనా యెఱఁగనా నేనేమైనా
మంతనాన నన్నతఁడే మన్నించీఁగాక
(॥॥)
పతినేల దూరేనే పడఁతీ
తతిగొన్ననావలపుఁ దడవేఁ గాక
రతిరా జేమిచేయునే రచ్చలోనను
ఇతవరి నావయసే ఇంతసేసీఁగాక
(॥॥)
సవతుల నననేలే సకియా
జవళినాచూపునే సాధించేఁగాక
నవకపుచంద్రునితో నాకేడ పగే
తివురుచు నావయసే దిమ్మురేఁచుఁగాక
(॥॥)
విరహముఁ దిట్టనేలే వెలఁది
తిరమైన నాబుద్దినే తెలిపేఁగాక
యిరవై శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నేలె
సరససల్లాపముల సతమయ్యేఁగాక
(||pallavi||)
iṁta vegiragattĕnā yĕṟam̐ganā nenemainā
maṁtanāna nannadam̐ḍe manniṁchīm̐gāga
(||||)
padinela dūrene paḍam̐tī
tadigŏnnanāvalabum̐ daḍavem̐ gāga
radirā jemiseyune rachchalonanu
idavari nāvayase iṁtasesīm̐gāga
(||||)
savadula nananele sagiyā
javaḽināsūbune sādhiṁchem̐gāga
navagabusaṁdrunido nāgeḍa page
tivurusu nāvayase dimmurem̐sum̐gāga
(||||)
virahamum̐ diṭṭanele vĕlam̐di
tiramaina nābuddine tĕlibem̐gāga
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannelĕ
sarasasallābamula sadamayyem̐gāga