(॥పల్లవి॥)
ఇంత వలచినవారి నెఱఁగమమ్మ
కాంతలు గుట్టుననుండే గతులా యివి
(॥ఇంత॥)
ఆఁపలేవు నీమనసు ఆతనిఁబాసి ఇంచుక
కాఁపురాలు సేసేవారికతలా యివి
చూపుల నాతని నిట్టె చూచేవు రెప్పవేయక
వూఁపవయసువారికి బుద్దులా ఇవి
(॥ఇంత॥)
మంతనాన నీమనసు మగనితోఁ జెప్పేవు
పంతగత్తెలైనవారిపగటా ఇది
సంతతము నీకునీవే చవులుచూపేవు మోవి
వంతువాసులవారికి వైపులా యివి
(॥ఇంత॥)
మేరసే కురముపై మిక్కిలి తావుకొంటివి
నేరుపరులైనవారినేర్పులా ఇవి
చేరి యలమేల్‌మంగవు శ్రీవేంకటేశుఁ గూడితి
వూరివారికెల్లాను వొనగడునా యిని
(||pallavi||)
iṁta valasinavāri nĕṟam̐gamamma
kāṁtalu guṭṭunanuṁḍe gadulā yivi
(||iṁta||)
ām̐palevu nīmanasu ādanim̐bāsi iṁchuga
kām̐purālu sesevārigadalā yivi
sūbula nādani niṭṭĕ sūsevu rĕppaveyaga
vūm̐pavayasuvārigi buddulā ivi
(||iṁta||)
maṁtanāna nīmanasu maganidom̐ jĕppevu
paṁtagattĕlainavāribagaḍā idi
saṁtadamu nīgunīve savulusūbevu movi
vaṁtuvāsulavārigi vaibulā yivi
(||iṁta||)
merase kuramubai mikkili tāvugŏṁṭivi
nerubarulainavārinerbulā ivi
seri yalamelmaṁgavu śhrīveṁkaḍeśhum̐ gūḍidi
vūrivārigĕllānu vŏnagaḍunā yini