ఇంత వలపంచితి విట్లానే రావయ్య
(॥పల్లవి॥)
ఇంత వలపంచితి విట్లానే రావయ్య
పొంతల నీ వున్నాఁ డవంటా బొమ్మల జంకించును
(॥ఇంత॥)
భామ కొంతవడి నీతో బయలు మాటలాడు
అముకొని నీవంటా యాందోళన
గోమునఁ జన్నులు మలఁగున నొత్తుదు నీవంటా
కామించినయటువంటికళ వళమునకు
(॥ఇంత॥)
వనిత కొంతవడి తా వట్టి యలుకలలుగు
మనవి చెప్పుతా నీతో మనోరదాన
వినయాన వేఁడుకొనుఁ జిలకను
తనివోనియాసలతమకంబునను
(॥ఇంత॥)
పడఁతి పూరకె నిన్ను భావించి నవ్వులు నవ్వు
తడయక కాఁగిలించు తలపోఁతల
అడరి శ్రీవేంకటేశ యంతలో నీకు మొక్కి
జడియక కూడిన సంతోమునను
(||pallavi||)
iṁta valabaṁchidi viṭlāne rāvayya
pŏṁtala nī vunnām̐ ḍavaṁṭā bŏmmala jaṁkiṁchunu
(||iṁta||)
bhāma kŏṁtavaḍi nīdo bayalu māḍalāḍu
amugŏni nīvaṁṭā yāṁdoḽana
gomunam̐ jannulu malam̐guna nŏttudu nīvaṁṭā
kāmiṁchinayaḍuvaṁṭigaḽa vaḽamunagu
(||iṁta||)
vanida kŏṁtavaḍi tā vaṭṭi yalugalalugu
manavi sĕppudā nīdo manoradāna
vinayāna vem̐ḍugŏnum̐ jilaganu
tanivoniyāsaladamagaṁbunanu
(||iṁta||)
paḍam̐ti pūragĕ ninnu bhāviṁchi navvulu navvu
taḍayaga kām̐giliṁchu talabom̐tala
aḍari śhrīveṁkaḍeśha yaṁtalo nīgu mŏkki
jaḍiyaga kūḍina saṁtomunanu