Imta tamagimturaa yimdarilonaa

ఇంత తమకింతురా యిందరిలోనా
Language

(॥పల్లవి॥)
ఇంత తమకింతురా యిందరిలోనా
పొంతనే రట్టుసేతురా పొందైనచోటను

(॥ఇంత॥)
చెక్కుపైఁ జేఇడుకొని సిగ్గువడియున్నచెలిఁ
గక్కసింతురా రతికిఁ గాంకలు సేసి
పిక్కటిల్లుఁజన్ను లిట్టె పిసికి నంతటిలోనె
మొక్కళపుఁదనమేల మోహించినచోటను

(॥ఇంత॥)
పడఁతిమాఁటుననుండి భావించిచూచేఇంతి-
నొడివట్టి తీతురా వొరయుచును
తొడిబడ నీ వప్పుడే తొక్కేవు పాదములు
గడుసరితనమేల కలసినచోటను

(॥ఇంత॥)
పానుపుపై గుట్టుతోడఁ బవ్వళించి యున్నసతి
ఆసవెట్టి కూడుదురా ఆయములంటి
మోనాన శ్రీవేంకటేశ మోవి పిప్పిసేసితివి
దీనకపుఁదనమేల తిరమైనచోటను

(||pallavi||)
iṁta tamagiṁturā yiṁdarilonā
pŏṁtane raṭṭusedurā pŏṁdainasoḍanu

(||iṁta||)
sĕkkubaim̐ jeiḍugŏni sigguvaḍiyunnasĕlim̐
gakkasiṁturā radigim̐ gāṁkalu sesi
pikkaḍillum̐jannu liṭṭĕ pisigi naṁtaḍilonĕ
mŏkkaḽabum̐danamela mohiṁchinasoḍanu

(||iṁta||)
paḍam̐timām̐ṭunanuṁḍi bhāviṁchisūseiṁti-
nŏḍivaṭṭi tīdurā vŏrayusunu
tŏḍibaḍa nī vappuḍe tŏkkevu pādamulu
gaḍusaridanamela kalasinasoḍanu

(||iṁta||)
pānububai guṭṭudoḍam̐ bavvaḽiṁchi yunnasadi
āsavĕṭṭi kūḍudurā āyamulaṁṭi
monāna śhrīveṁkaḍeśha movi pippisesidivi
dīnagabum̐danamela tiramainasoḍanu