Imta seyimchevaamda vellaa neeve kaaga

ఇంత సేయించేవాఁడ వెల్లా నీవే కాక
Language

(॥పల్లవి॥)
ఇంత సేయించేవాఁడ వెల్లా నీవే కాక
సంతత మేడ గొడవ సవతులచేతను

(॥ఇంత॥)
మచ్చిక నాతో నీవు మాటలాడితి వంటాను
అచ్చలానఁ గోపగించీ నాకె నామీఁద
యిచ్చగించి నీవు నాయింటికి వచ్చితి వంటా
కొచ్చి కొచ్చి నన్నునే గొరబు సేసేని

(॥ఇంత॥)
మొదల వీడెము నాకు మోహనఁ బెట్టితి వంటా
ఆదిగో న న్నాడుకొనీ నందరితోడ
యెదుగా సొమ్ములు నీ విప్పుడే యిచ్చితి వంటా
కొదలుఁ దిట్ల లోలో గొణఁగీఁ బెదవులా

(॥ఇంత॥)
యిద్దరముఁ బానుపుపై యేకత మున్నార మంటా
గుద్దిరాన వాకిటనే కూచున్నది
తిద్దితివి జగడము తేరిచి శ్రీవేంకటేశ
అద్దొ మొదల మమ్ము నార డింత సేతురా

(||pallavi||)
iṁta seyiṁchevām̐ḍa vĕllā nīve kāga
saṁtada meḍa gŏḍava savadulasedanu

(||iṁta||)
machchiga nādo nīvu māḍalāḍidi vaṁṭānu
achchalānam̐ gobagiṁchī nāgĕ nāmīm̐da
yichchagiṁchi nīvu nāyiṁṭigi vachchidi vaṁṭā
kŏchchi kŏchchi nannune gŏrabu seseni

(||iṁta||)
mŏdala vīḍĕmu nāgu mohanam̐ bĕṭṭidi vaṁṭā
ādigo na nnāḍugŏnī naṁdaridoḍa
yĕdugā sŏmmulu nī vippuḍe yichchidi vaṁṭā
kŏdalum̐ diṭla lolo gŏṇam̐gīm̐ bĕdavulā

(||iṁta||)
yiddaramum̐ bānububai yegada munnāra maṁṭā
guddirāna vāgiḍane kūsunnadi
tiddidivi jagaḍamu terisi śhrīveṁkaḍeśha
addŏ mŏdala mammu nāra ḍiṁta sedurā