Imta seyagumdidenu yeebegu valaduvaa

ఇంత సేయకుండితేను యీపెకు వలతువా
Language

(॥పల్లవి॥)
ఇంత సేయకుండితేను యీపెకు వలతువా
వింతలుగాఁ గానవచ్చె వేడుక మీ కతలు

(॥ఇంత॥)
తెరమరఁగున నుండి తేనెగార మాఁటలాడి
కరఁగించీ నిన్ను నెంత కలికో కాని
సొరిదిఁ జెలుల చేత సూడిదెలు సారె నంపి
మెరవుసేయదు నీకు నెక్కడిదోకాని

(॥ఇంత॥)
తొలకరి మెరుఁగై తొంగి తొంగి నిన్నుఁ జూచీ
యెలయింపులాఁడి యీపె యెవ్వతోకాని
చిలుకకు నీపేరు చెప్పి చెప్పి పిలిపించీ
సొలసి సొలసి యెంత చుట్టమోకాని

(॥ఇంత॥)
ముసుఁగు వెట్టుక వచ్చి ముచ్చటల నీతో నవ్వీ
వసుధ నీకెంత చనవరియో కాని
వెస నలమేలుమంగ విభుఁడ శ్రీవేంకటేశ
యెసగ నన్నేలితివి యీకె యేమౌనోకాని

(||pallavi||)
iṁta seyaguṁḍidenu yībĕgu valaduvā
viṁtalugām̐ gānavachchĕ veḍuga mī kadalu

(||iṁta||)
tĕramaram̐guna nuṁḍi tenĕgāra mām̐ṭalāḍi
karam̐giṁchī ninnu nĕṁta kaligo kāni
sŏridim̐ jĕlula seda sūḍidĕlu sārĕ naṁpi
mĕravuseyadu nīgu nĕkkaḍidogāni

(||iṁta||)
tŏlagari mĕrum̐gai tŏṁgi tŏṁgi ninnum̐ jūsī
yĕlayiṁpulām̐ḍi yībĕ yĕvvadogāni
silugagu nīberu sĕppi sĕppi pilibiṁchī
sŏlasi sŏlasi yĕṁta suṭṭamogāni

(||iṁta||)
musum̐gu vĕṭṭuga vachchi muchchaḍala nīdo navvī
vasudha nīgĕṁta sanavariyo kāni
vĕsa nalamelumaṁga vibhum̐ḍa śhrīveṁkaḍeśha
yĕsaga nannelidivi yīgĕ yemaunogāni