ఇంత సేయకుండితే నీ విచ్చగింతువా
(॥పల్లవి॥)
ఇంత సేయకుండితే నీ విచ్చగింతువా
సంతోసించేదానివలెఁ జవిచూపె మోవి
(॥ఇంత॥)
బచ్చెనమాటలు నీతోఁ బచరించి
కొచ్చి కొచ్చి సొలసీని కోమలి నిన్ను
మెచ్చేదానివలెనే మేకులుసేసి
కుచ్చి కాఁగిలించుకొని కుమ్మరించీ వలపు
(॥ఇంత॥)
ననుపుసేసుక నీవు నవ్వు నవ్వి
చనవులు నెరపీని సారెకును
చెనకేదానివలెను చెక్కులు వట్టి
పెనఁగుతానే యింకాఁ బ్రియములు రేఁచీని
(॥ఇంత॥)
జంకెనచూపులు నీపైఁ జాఁచి చాఁచి
అంకెల జన్నుల నొత్తీ నప్పటిఁ దాను
లంకెల శ్రీవేంకటేశ లావున నలమేల్మంగ
తెంకి రతులనుఁ గూడి తెమలించీ సిగ్గులు
(||pallavi||)
iṁta seyaguṁḍide nī vichchagiṁtuvā
saṁtosiṁchedānivalĕm̐ javisūbĕ movi
(||iṁta||)
bachchĕnamāḍalu nīdom̐ basariṁchi
kŏchchi kŏchchi sŏlasīni komali ninnu
mĕchchedānivalĕne megulusesi
kuchchi kām̐giliṁchugŏni kummariṁchī valabu
(||iṁta||)
nanubusesuga nīvu navvu navvi
sanavulu nĕrabīni sārĕgunu
sĕnagedānivalĕnu sĕkkulu vaṭṭi
pĕnam̐gudāne yiṁkām̐ briyamulu rem̐sīni
(||iṁta||)
jaṁkĕnasūbulu nībaim̐ jām̐si sām̐si
aṁkĕla jannula nŏttī nappaḍim̐ dānu
laṁkĕla śhrīveṁkaḍeśha lāvuna nalamelmaṁga
tĕṁki radulanum̐ gūḍi tĕmaliṁchī siggulu