Imta seyagumdide ne neda numdunu

ఇంత సేయకుండితే నే నేడ నుందును
Language

(॥పల్లవి॥)
ఇంత సేయకుండితే నే నేడ నుందును
యెంత పుణ్యమో నీకు యేమి చెప్పే దింకను

(॥ఇంత॥)
అట్టె నన్నుద్ధరించినయదె నీ ప్రతాపము
వొట్టి సంపన్నుఁ జేసె నీ వుదారత్వము
గుట్టున వెనకవేసుకొనెను నీ పంతము
యిట్టి నా భాగ్యము నేఁడు యేమి చెప్పే దింకను

(॥ఇంత॥)
నరకము వెళ్లఁ దీసె నన్ను నీ సాహసము
సరగ జ్ఞానిఁ జేసె నీ చాతుర్యము
మరిగించుకొనె నన్ను మఱి నీ వాత్సల్యము
యిరవాయె నా వేడుక యేమి చెప్పే దింకను

(॥ఇంత॥)
నన్ను లోకపూజ్యుఁ జేసె నాఁడే నీ దొరతనము
విన్నపము లాలించే నీ విచారము
మన్నించె శ్రీవేంకటేశ మమ్ము నీ పట్టపుదేవి
యిన్నిటా బ్రదికించితి వేమి చెప్పే దింకను

(||pallavi||)
iṁta seyaguṁḍide ne neḍa nuṁdunu
yĕṁta puṇyamo nīgu yemi sĕppe diṁkanu

(||iṁta||)
aṭṭĕ nannuddhariṁchinayadĕ nī pradābamu
vŏṭṭi saṁpannum̐ jesĕ nī vudāratvamu
guṭṭuna vĕnagavesugŏnĕnu nī paṁtamu
yiṭṭi nā bhāgyamu nem̐ḍu yemi sĕppe diṁkanu

(||iṁta||)
naragamu vĕḽlam̐ dīsĕ nannu nī sāhasamu
saraga jñānim̐ jesĕ nī sāduryamu
marigiṁchugŏnĕ nannu maṟi nī vātsalyamu
yiravāyĕ nā veḍuga yemi sĕppe diṁkanu

(||iṁta||)
nannu logabūjyum̐ jesĕ nām̐ḍe nī dŏradanamu
vinnabamu lāliṁche nī visāramu
manniṁchĕ śhrīveṁkaḍeśha mammu nī paṭṭabudevi
yinniḍā bradigiṁchidi vemi sĕppe diṁkanu