ఇంత సేయగా నీకిందు యేమివచ్చెనే నీవు
(॥పల్లవి॥)
ఇంత సేయగా నీకిందు యేమివచ్చెనే నీవు
యింతివేకావా చెలి యిదియేమే
(॥ఇంత॥)
అలరిచేతలవిభుఁ డాతఁడేడ నేనేడ
చాలుఁజాలు నింత నీకు చలమేఁటికే
మూలనుండేవారిఁ దెచ్చి ముంగిటఁ వేసేనంటా
యేల యిట్టె బోదించే విదియేమే నీవు
(॥ఇంత॥)
మాయదారివిభుఁడెంత మరిగిననేనెంత
ఆయనాయ ననునేల యలయించేవే
వోయమ్మ చల్లవేఁడై వున్ననన్ను నతనితో
యీయెడనే కూడుమనే విదియేమే నీవు
(॥ఇంత॥)
యింతలోనే శ్రీవేంకటేశుఁడే దక్కె నిట్లు
సంతముసేసితిని మెచ్చఁగవలెనే
పంతము పలుకు నొక్కపాటిగా మెలఁగునాపై
యెంతకెంతమమకార మిదియేమే నీవు
(||pallavi||)
iṁta seyagā nīgiṁdu yemivachchĕne nīvu
yiṁtivegāvā sĕli yidiyeme
(||iṁta||)
alarisedalavibhum̐ ḍādam̐ḍeḍa neneḍa
sālum̐jālu niṁta nīgu salamem̐ṭige
mūlanuṁḍevārim̐ dĕchchi muṁgiḍam̐ vesenaṁṭā
yela yiṭṭĕ bodiṁche vidiyeme nīvu
(||iṁta||)
māyadārivibhum̐ḍĕṁta mariginanenĕṁta
āyanāya nanunela yalayiṁcheve
voyamma sallavem̐ḍai vunnanannu nadanido
yīyĕḍane kūḍumane vidiyeme nīvu
(||iṁta||)
yiṁtalone śhrīveṁkaḍeśhum̐ḍe dakkĕ niṭlu
saṁtamusesidini mĕchcham̐gavalĕne
paṁtamu palugu nŏkkabāḍigā mĕlam̐gunābai
yĕṁtagĕṁtamamagāra midiyeme nīvu